ACB Raids: వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కడప ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో 20 మంది అధికారుల బృందం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది. తహసీల్దార్ రామకుమారిపై వచ్చిన అభియోగాల మేరకు ఆమె హయాంలో జరిగిన భూ లావాదేవీల రికార్డులన్నింటినీ అనిశా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్లో రికార్డుల వివరాలను ఆరా తీస్తున్నారు. పాసు పుస్తకాల మంజూరు, ఇతర సర్వేలకు సంబంధించిన వివరాలు, వివిధ ఇళ్ల స్థలాల మంజూరు తదితర వివరాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత 3 ఏళ్లకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఆన్లైన్లో ఏ విధంగా నమోదు చేశారని దానిపై వివరాలు సేకరిస్తున్నారు. వీటితోపాటు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలను కూడా విచారిస్తున్నారు. ఈ కార్యాలయానికి ఏ పని మీద ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు.. ఎందుకు జాప్యం జరుగుతోంది.. అనే వివరాలు తెలుసుకుంటున్నారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి : LOCK: రెండేళ్లైనా చెల్లించని బిల్లులు.. సచివాలయానికి తాళం