ETV Bharat / city

ఫొటోలు అశ్లీలంగా మార్ఫింగ్​...యువతులకు బెదిరింపులు - ఇన్ స్టా ఫొటోలు అశ్లీలంగా మారుస్తున్న గుంటూరు యువకుడు

సామాజిక మాధ్యమాలు ఎంత సౌలభ్యాన్ని ఇస్తాయో... అంతే చెడు చేస్తాయి. పరిధి దాటితే పరిస్థితులు చేదాటిపోతుంటాయి. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి..మెలగాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అని పరిచయం అవుతుంటారు. మాయమాటలతో వివరాలు సేకరిస్తారు. ఫొటోలు పంపమని ఒత్తిడి చేస్తారు. ఫ్రెండే కదా అని ఫొటోలు పంపితే... అప్పుడుగాని అసలు రంగు బయటపడదు. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు సేకరించి..అశ్లీలంగా మార్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడో యువకుడు.

ఇన్ స్టా ఫొటోలు అశ్లీలంగా మార్ఫ్...యువతులకు బెదిరింపులు

author img

By

Published : Jul 15, 2020, 9:51 PM IST

సామాజిక మాధ్యమాల్లో యువతుల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న రఘుబాబు అనే యువకుడిని గుంటూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇప్పటివరకూ 10 మంది యువతులను రఘుబాబు బెదిరించినట్లు విచారణలో తేలింది. కేసు వివరాలను గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.

జిల్లాలోని నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన రఘుబాబు కేరళలో యానిమేషన్ కోర్సు నేర్చుకున్నాడు. లాక్ డౌన్ తో సొంతూరుకు వచ్చిన ఈ యువకుడు నకిలీ వివరాలతో... ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించి కొందరు విద్యార్థినుల ఫొటోలు సేకరించి... వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రాలను యువతులకు పంపి..బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు యువకుడి ఆటకట్టించారు. సామాజిక మాధ్యమాలు ఉపయోగించేటప్పుడు అడుగడుగునా ముప్పు పొంచి ఉంటుందని ఎస్పీ అన్నారు. ఎవరికీ వ్యక్తిగత సమాచారం, లొకేషన్ వివరాలు పంపరాదని సూచించారు.

ఇదీ చదవండి : 'యజమాని హక్కులకు భంగం కలగకుండా కొత్త కౌలుదారు చట్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.