ETV Bharat / city

యువరైతు అనుమానాస్పద మృతి.. హత్యా..? ఆత్మహత్యా..?? - Young Farmer Suspicious Death in Palnadu

Young Farmer Suspicious Death: పల్నాడు జిల్లా ఇనిమెళ్ళ గ్రామానికి చెందిన యువరైతు షేక్ బాజీ సైదా పొలంలో మృతిచెందాడు. మృతదేహం వద్ద పురుగు మందు డబ్బా కనిపించడంతోపాటు.. సైదా శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయి. దీంతో.. ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Young Farmer Suspicious Death
Young Farmer Suspicious Death
author img

By

Published : Jun 1, 2022, 2:16 PM IST

Young Farmer Suspicious Death: పల్నాడు జిల్లా వినుకొండ ఈపూరు మండలం ఇనిమెళ్ళ గ్రామానికి చెందిన షేక్ బాజీ సైదా (30) అనే యువరైతు పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే..?
మంగళవారం ఇంటి నుంచి ఎప్పటిలాగే పొలానికి వెళ్ళిన బాజీ సైదా రాత్రైనా ఇంటికి రాలేదు. సైదా కోసం కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం గాలించారు. చివరకు పొలంలో సైదా మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. మృతదేహం వద్ద పురుగు మందు డబ్బాలు, ద్విచక్ర వాహనం ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించి చూడగా శరీరంపై బలమైన గాయాలు, వీపు భాగం కాలిపోయి ఉండడాన్ని గమనించారు. దీంతో సైదాని ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

గత ఐదేళ్లుగా గ్రామంలోని కొందరు సైదాతో స్నేహంగా ఉంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారితో కలిసి వెళ్లినపుడు సైదా సక్రమంగా ఇంటికి వచ్చేవాడు కాదని.. అదేమని ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై చేయిచేసుకునేవాడని మృతుని సోదరుడు ఫరీద్ వలీ చెబుతున్నాడు. బాజీ సైదా మృతికి అతని వెంట ఉండే స్నేహితులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఈపూరు పోలీసులు సంఘటన ప్రాంతాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు

.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.