ప్రభుత్వ ప్రతిఫలాలు ప్రజలకు అందించడంలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని... గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన ఓ వాలంటీర్ను విధుల నుంచి తప్పించినట్టు ఆమె తెలిపారు. కోబాల్ట్పేట ప్రాంతం 123 సచివాలయం పరిధిలోని ఓ లబ్ధిదారుడు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా... వారికి స్థలం మంజూరయ్యింది. అయినప్పటికీ ఆ ప్రాంత వాలంటీర్ సయ్యద్ అఫ్ఫాన్ అహ్మద్.. ఇంటి స్థలం మంజూరు కావాలంటే తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు లబ్ధిదారు ఫిర్యాదు చేయగా... నోడల్ అధికారి, 123 సచివాలయ అడ్మిన్ సెక్రటరీ విచారణకు ఆదేశించారు. విచారణలో వాలంటీర్ సయ్యద్ అఫ్ఫాన్ అహ్మద్ నగదు తీసుకున్నట్లు నిరూపణ కాగా.. తక్షణమే వాలంటీర్ను విధుల నుంచి తొలగించినట్లు చల్లా అనురాధ వివరించారు.
ఇదీ చదవండీ... 'దళితుల ప్రాణాలంటే వైకాపా నాయకులకు చులకనా?'