ETV Bharat / city

'రూ. 1.60 లక్షలు చెల్లించండి.. అప్పటి వరకూ డిశ్చార్జ్ చేసేది లేదు..!' - ambati rambabu

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు కొవిడ్ వైద్యశాలలో అధిక ఫీజుల వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. బాధితుడు తన భార్యను ఆసుపత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేయకుండా డబ్బు కట్టాలని వత్తిడి తెస్తున్నట్లు ఎమ్మెల్యే అంబటి కి ఫిర్యాదు చేయడంతో అతడికి ఊరట లభించింది.

corona news
రోనా రోగిని డిశ్చార్జ్ చేయని ఆసుపత్రి
author img

By

Published : May 20, 2021, 9:18 AM IST

రోనా రోగిని డిశ్చార్జ్ చేయని ఆసుపత్రి గురించి చెబుతున్న బాధితుడు..

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని ఒక ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రిలో అధిక ఫీజుల వసూలు చేస్తున్నారంటూ.. ఓ బాధితుడు ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఫిర్యాదు చేశారు. తన భార్యకు కరోనా చికిత్స అందించిన ఆసుపత్రి యాజమాన్యం.. ఫీజు చెల్లించలేదని డిశ్చార్జ్ చేయడం లేదని వాపోయాడు. తనకు డబ్బు చెల్లించే స్తోమత లేదని.. న్యాయం చేయాలని కోరాడు.

అసలేమైందో బాధితుడి మాటల్లో..

ఈ నెల 9వ తేదీన కోవిడ్ చికిత్స కోసం పట్టణంలోని గజ్జెల ఆసుపత్రిలో తన భార్య ఉమామహేశ్వరిని మురళీకృష్ణ అనే వ్యక్తి చేర్చాడు. ఆరోగ్య శ్రీ పథకం కింద కరోనా చికిత్స అందిస్తామని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నమ్మించినట్లు బాధితుడు తెలిపాడు. గత పదిరోజులుగా కరోనా చికిత్స అందించినట్లు అతడు తెలిపారు. అయితే ఇప్పుడు తన భార్యను డిశ్చార్జ్ చేసేందుకు రూ. 1,60,000 చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబును ఆశ్రయించడంతో.. ఆసుపత్రి యాజమాన్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల చొరవతో బాధితుడికి ఊరట..

ఈ ఘటనపై... వెంటనే నోడల్ అధికారిని పిలిపించి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అంబటి ఆదేశాలతో అధికారులు వైద్యశాల యాజమాన్యంతో మాట్లాడారు. నిబంధనల మేరకు కొంతమేర ఫీజు తీసుకొని ఉమామహేశ్వరిని డిశ్చార్జ్ చేశారు.

ఇవీ చదవండి:

పల్లె ప్రాంతాల్లో కరోనా కట్టడి ముఖ్యం!

కారు బీభత్సం.. డెయిరీ పార్లర్ లోకి దూసుకెళ్లిన వాహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.