Traffic jam: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రివేళ జరిగే ప్రభల సందడిని తిలకించేందుకు వచ్చిన భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, అధికారులు ట్రాఫిక్ ప్రణాళికలు సరిగా రూపొందించకపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Traffic jam: త్రికోటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు కొండకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ సెగ తప్పలేదు. కోటప్పకొండ నుంచి పెట్లూరివారిపాలెం రహదారిలో ఐదు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో మంత్రి వెల్లంపల్లి వాహనం మూడున్నర గంటలపైన ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. బస్సులు, కార్లు, ద్విచక్రవాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదు కిలోమీటర్ల మేర కోటప్పకొండ తిరునాళ్లను తిలకించేందుకు భక్తులు నడిచివెళ్లారు.
ఇదీ చదవండి: