- సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా.. కారణం?
ముఖ్యమంత్రి జగన్(cm jagan) .. పోలవరం పర్యటన వాయిదా పడింది. వాతవరణం అనుకూలించని కారణంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు'
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను ఆయన పరామర్శించారు. ధూళిపాళ్ల నరేంద్రకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐదేళ్ల పాపతో సహా గోదావరిలో దూకిన మహిళ
ఐదేళ్ల పాపతో కలిసి ఓ మహిళ గోదావరిలో దూకింది. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కరోనా వేరియంట్లపై ఓ కన్నేసి ఉంచాలి'
కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలోని తొలి కరోనా రోగికి మరోసారి పాజిటివ్
దేశంలోని తొలి కరోనా రోగికి మరోసారి వైరస్ సోకింది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. గతేడాది జనవరిలో చైనా నుంచి సెలవుల నిమిత్తం భారత్‌కు వచ్చిన విద్యార్థినికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అత్యాచారానికి యత్నించి.. కత్తితో ముఖంపై పొడిచి...
లైంగిక వేధింపులను ప్రతిఘటించిన బాలిక(15)పై ఓ యువకుడు(23) పైశాచికత్వం ప్రదర్శించాడు. కత్తితో ఆమె ముఖంపై దాడి చేశాడు.ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిందీ దారుణం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ టీకా తీసుకుంటే అతికొద్ది మందికి అరుదైన వ్యాధి!
జాన్సన్ టీకాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ టీకాకు నూతన హెచ్చరిక జారీచేసింది అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారు అరుదైన నాడీ సంబంధ రుగ్మత బారినపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలనుకునే వారికి షాక్!
దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఒక్కొక్కటిగా తమ వాహనాల ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే బజాజ్ ఆటో, మారుతీ, మహీంద్రా వంటి కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచగా.. ఈ జాబితాలో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒలింపిక్స్‌కు మరో స్టార్ టెన్నిస్ ప్లేయర్ దూరం
టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకొంటున్నట్లు మరో టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి ప్రకటించింది. కెనడాకు చెందిన బియాంకా ఆండ్రెస్కు కొవిడ్ మహమ్మారి కారణంగా విశ్వక్రీడల నుంచి వైదొలిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైకోర్టులో హీరో విజయ్‌కు షాక్.. రూ.లక్ష జరిమానా
తమిళ హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశం నుంచి ఓ లగ్జరీ కారును దిగుమతి చేసుకోగా.. దానికి పన్ను మినిహాయింపు కోసం 2012లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.