అమరావతి రైతులు 600 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్ధతుగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజల కలను జగన్ రెడ్డి చెల్లాచెదురు చేశారని అచ్చెన్న దుయ్యబట్టారు. భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. నిండు అసెంబ్లీలో రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని జగన్ చెప్పారన్న అచ్చెన్న..రాజధానికి కనీసం 30వేల ఎకరాలు తగ్గకుండా ఉండాలని అన్నారని గుర్తు చేశారు. చర్చి, మసీదు, గుళ్ల నుండి మట్టిని తెచ్చి అమరావతికి శంకుస్థాపన చేస్తే , అవమానించేలా జగన్ వ్యవహరం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి ప్రతిఫలం దక్కి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయమని తేల్చి చెప్పారు.
రైతులదే అంతిమ విజయం..
అమరావతిని అంతం చేసేందుకు వైకాపా నాయకులు గల్లీ నుంచి దిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటిని రైతులు ఓర్పుతో ఛేదించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బెదిరింపులు, అణిచివేత, అరెస్టులకు అదరం బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. ప్రజారాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణిచివేతకి ఎదురొడ్డి నిలిచి మహోద్యమం అయ్యిందని పునరుద్ఘటించారు. జై అమరావతి పోరాటం 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపాడం తగదని మండిపడ్డారు.
వ్యాన్లలో కుక్కి సెల్ లో బంధించి,రైతుల కాళ్లు విరగ్గొట్టారని లోకేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల పట్ల మగపోలీసులు అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధుల్ని నిర్బందించారని ఆక్షేపించారు. ఖాకీల వలయాన్ని ఛేదించుకుని మంగళగిరి దేవస్థానం చేరుకుని జై అమరావతి అని నినదించడమే నేరంగా జైళ్లలో బందీలైన రైతులు,మహిళలు, టిడిపి నేతలు, ఉద్యమకారుల పోరాటానికి తాను శిరసు వంచి నమస్కరిస్తునన్నారు.
న్యాయమైన రైతుల పోరాటానిదే అంతిమ విజయమని, అమరావతి శాశ్వతమని తెల్చిచెప్పారు. రోడ్లను సైతం తవ్వేస్తూ అమరావతిని చంపేశాం అని జగన్ రెడ్డి ఆనందపడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. వైకాపా తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారని ఎద్దేవా చేశారు. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులదే అంతిమ విజయం వరించబోతుందని అభిప్రాయపడ్డారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధుల్ని నిర్బందించారని ఆక్షేపించారు. ఖాకీల వలయాన్ని ఛేదించుకుని మంగళగిరి దేవస్థానం చేరుకుని జై అమరావతి అని నినదించడమే నేరంగా జైళ్లలో బందీలైన రైతులు,మహిళలు, టిడిపి నేతలు, ఉద్యమకారుల పోరాటానికి తాను శిరసు వంచి నమస్కరిస్తునన్నారు. న్యాయమైన రైతుల పోరాటానిదే అంతిమ విజయమని, అమరావతి శాశ్వతమని తెల్చిచెప్పారు.
నాడు అమరావతిని జగన్ స్వాగతించ లేదా...
'ప్రతిపక్ష నేతగా అమరావతిని జగన్ స్వాగతించ లేదా... ఆనాడు స్వాగతించిన జగన్ నేడు అడ్డుకుంటున్నారు. మోసం అనే పదం జగన్‌ను చూసే పుట్టిందేమో అనిపిస్తోంది.శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలు, రైతులను అరెస్టు చేస్తారా. మీడియాను అడ్డుకోవటం పత్రికా స్వేచ్ఛను హరించటమే. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎందరో రైతులు భూములు త్యాగం చేశారు. రైతులు, రాష్ట్ర భవిష్యత్తును జగన్ అంధకారం చేశారు. జగన్ 3 రాజధానులు కడతానని చెప్పి 600 రోజులైంది. ఇప్పటివరకు ఎక్కడైనా 6 ఇటుకలు కూడా పేర్చలేదు.'- యనమల రామకృష్ణుడు, తెదేపా నేత
మాజీ మంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్...
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను పోలీసులు గొల్లపూడిలో హౌస్ అరెస్ట్ చేశారు. రాజధాని రైతులపై పోలీసుల నిరంకుశ వైఖరిని ఖండిస్తూ గొల్లపుడి హైవేపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో దేవినేని, కొనకళ్లను గృహనిర్భంధం చేశారు. గేట్లకు తాళం వేశారు. అమరావతి ఉద్యమం 600 రోజుకు చేరుకుందని, న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా ప్రతి ఒక్కరు అమరావతి కోసం మొక్కుతున్నారని ఉమా అన్నారు.
33 వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జగన్ తాను ఇక్కడ పెద్ద ఇల్లు కట్టుకున్నానని, చంద్రబాబుకి ఇళ్లే లేదని శాసన సభలో, బయట చెప్పి నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఇవాళ రైతాంగాన్ని గొంతు కోశారని ధ్వజమెత్తారు. అమరావతిలో పోలీసులు లాఠీలతో రైతు వెంట పడుతున్నారని, దళిత జేఏసీ నాయకురాలు శిరీష అనే తల్లిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు కూడా ర్యాలీలో పాల్గొనటానికి వీలు లేకుండా ఎక్కడికిక్కడ హౌస్ అరెస్ట్ లు చేశారని మండిపడ్డారు. రైతులు, మహిళల మీద దాడులు చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అమరావతి అనే స్లోగన్ కూడా వినలేకపోతున్నారని, తమ బాధ, ఆవేదన తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు.ప్రభుత్వానికి చలనం లేదు: కొల్లు రవీంద్ర
అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా మచిలీపట్నంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో నిరసన తెలియచేశారు. అమరావతి రైతులు 600 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వానికి చలనం లేకుండా ఉందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
ఇదీ చదవండి