పెంచిన ఇంధన ధరలను నియంత్రించాలని కోరుతూ.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిక ముందే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియచేయడానికి వచ్చిన తమను అరెస్టు చేయడం దారుణమని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు తెదేపా నాయకులకు మధ్య తోపులాట జరిగి బస్టాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి లాలపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
వైకాపా ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ లేదని... శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన తమని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని తెదేపా నేతలు మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్పై పన్నుల రూపంలో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నిరంకుశ పాలనకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నిర్వహణ లోపాలు... అయినా కోట్ల ధారబోత