అమరావతి ఉద్యమం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఐటీ దాడుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద రాజకీయ ఐకాస నిరాహార దీక్షను ఆయన ప్రారంభించి దీక్షాపరులను అభినందించారు. ఐటీ దాడులన్నింటినీ ప్రతిపక్ష నేతకు ఆపాదించటం సరికాదన్నారు. ఇప్పుడు ప్రతిపక్షనేతకు, ఆయన కుమారుడికి భద్రతను తగ్గించిన ప్రభుత్వం ఏం చేయబోతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోందని, ఎన్ని అడ్డంకులు పెట్టినా వెనక్కి తగ్గేదిలేదని...రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు ఉద్యమం సాగిస్తామని పేర్కొన్నారు.
'ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఉద్యమాన్ని ఆపేది లేదు'
అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ... పోరాటాన్ని ఆపేదే లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఉద్ఘాటించారు.
అమరావతి ఉద్యమం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఐటీ దాడుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద రాజకీయ ఐకాస నిరాహార దీక్షను ఆయన ప్రారంభించి దీక్షాపరులను అభినందించారు. ఐటీ దాడులన్నింటినీ ప్రతిపక్ష నేతకు ఆపాదించటం సరికాదన్నారు. ఇప్పుడు ప్రతిపక్షనేతకు, ఆయన కుమారుడికి భద్రతను తగ్గించిన ప్రభుత్వం ఏం చేయబోతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోందని, ఎన్ని అడ్డంకులు పెట్టినా వెనక్కి తగ్గేదిలేదని...రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు ఉద్యమం సాగిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి-58 మందితో భద్రత ఇస్తూ 183 అని చెబుతారా?