ఇదీ చదవండి :
కౌలు రైతులందరికీ రైతుభరోసా అమలుకు తెదేపా డిమాండ్ - రైతు భరోసాపై తెదేపా కామెంట్స్
ఎన్నికల ముందు రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చాక వైకాపా మాటమార్చిందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కౌలు రైతులకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాటా మార్చారని ఆరోపించారు. కౌలుదారులందరికీ రైతుభరోసా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కౌలు రైతులందరికీ రైతుభరోసా అమలుచేయాలి : జీవీ ఆంజనేయులు
రైతు ప్రభుత్వం మంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా.... రైతులను దగా చేస్తుందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రైతు భరోసాను కౌలురైతులందరికీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులుంటే ... 54 లక్షల మందికే రైతుభరోసా ఇస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు స్వయంగా ప్రతీ రైతుకు రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చిన వైకాపా ఇప్పుడు మాటమార్చిందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి 13,500 ఇస్తామని చెప్పడం సబబుకాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు జీవీ ఆంజనేయులు. వైకాపా అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 190 మంది రైతుల అత్మహత్య చేసుకోన్నారని ఆరోపించారు. రైతులను మోసగించిన ప్రభుత్వానికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఒక శాపంగా మారిందని తెదేపా నేత నసీర్ అహ్మద్ విమర్శించారు. ఇప్పటికైనా నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
ఇదీ చదవండి :
Intro:Body:Conclusion: