ETV Bharat / city

BJP MP GVL: వైకాపా ప్రభుత్వంపై అందరికీ నమ్మకం పోయింది: జీవీఎల్ - నరసరావుపేటలో భాజపా

వైకాపా ప్రభుత్వం చెత్త మీద విధించిన పన్ను, అనధికారికంగా తొలగించిన పెన్షన్లపై నిరసనగా భాజపా నాయకులు గుంటూరులో ధర్నా నిర్వహించారు. వైకాపా ప్రభుత్వంపై నమ్మకం లేకనే పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.

BJP MP GVL
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సత్తా తెదేపాకు లేదు - జీవీఎల్
author img

By

Published : Oct 6, 2021, 6:56 PM IST

Updated : Oct 6, 2021, 7:24 PM IST

వైకాపా ప్రభుత్వం చెత్త మీద విధించిన పన్ను, అనధికారికంగా తొలగించిన పెన్షన్లపై నిరసనగా భాజపా నాయకులు గుంటూరులో ధర్నా నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కనుమరుగైందని.. ఎన్నికలంటే ఏదో ఒక కుంటిసాకు చెప్పి పోటీ చేయకుండా తప్పుకుంటున్నారని తెదేపాను విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేసే సత్తా తెదేపా నేతలకు లేదని ఆయన ఎద్దేవా చేశారు.

వైకాపా ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం పోషించే ఏకైక పార్టీ భాజపానే అన్నారు. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని ఎన్నికల్లో పోటీచేసే సత్తా కేవలం భాజపాకే మాత్రమే ఉందని... ఏ ఒక్క ఎన్నికను కూడా విరమించేది ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తప్పుపట్టారు. వైకాపా ప్రభుత్వంపై నమ్మకం లేకనే ప్రభుత్వానికి పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.

నరసరావుపేట ప్రాంతంలో కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రంను ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జీవీఎల్ స్థల పరిశీలన చేశారు. నరసరావుపేట వాస్తవ్యుడిగా, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నరసరావుపేట అభివృద్ధే తన ధ్యేయమని జీవీఎల్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : New Agriculture Acts: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: జీవీఎల్

Last Updated : Oct 6, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.