బ్యాంకులను మోసగించారన్న ఆరోపణలతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థపై సీబీఐ గత డిసెంబరులో కేసు నమోదు చేసింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొంతమంది మోసగాళ్లు... డబ్బు వసూళ్లకు ప్రయత్నించారు.
సీబీఐ పేరుతో బెదిరింపులు
మణివర్ధన్‌రెడ్డి ముఠా ఈ ఏడాది జనవరి 3న తాము సీబీఐ అధికారులమని చెబుతూ రాయపాటి సాంబశివరావుకు ఫోన్ చేశారు. డబ్బులిస్తే కేసు నుంచి బయట పడేస్తామన్నారు. జనవరి 4న మణివర్ధన్‌రెడ్డి స్వయంగా గుంటూరు వెళ్లి రాయపాటిని కలిసి.. అడిగినంత ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
తీగ లాగితే కదిలిన డొంక
ఈ బెదిరింపులపై రాయపాటి సాంబశివరావు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... ఫోన్ చేసిన వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. చివరకు మణివర్ధన్‌రెడ్డి, రామరాజ్‌ను అరెస్టు చేశారు. విచారణ లోతుల్లోకి వెళ్లిన కేంద్రదర్యాప్తు సంస్థ అధికారులకు మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలు కనిపించాయి. ఇందులో తమిళ నటుల పాత్ర ఉన్నట్టు తెలిసింది.
తమిళ నటి, ఆయన భర్త సూత్రధారులు
తమిళనటి లీనా మరియా పాల్, ఆమె భర్త సుఖేష్ చంద్రశేఖర్ ఈ కథనంతా నడిపించినట్టు గుర్తించారు. ఒక్క రాయపాటి సాంబశివరావే కాకుండా సీబీఐ కేసులు ఉన్న చాలా మందిని వీళ్లు సంప్రదించినట్టు తెలిసింది. కేసుల నుంచి తప్పిస్తామని... లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరింపులకు దిగినట్టు సీబీఐ అధికారుల విచారణలో తేలింది.
ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకుని.. అభిమానులకు శోకాన్ని మిగిల్చారు!