ETV Bharat / city

కోవిడ్​ కేర్​ సెంటర్లలో సిబ్బంది అలసత్వంపై.. సబ్​కలెక్టర్ ఆగ్రహం

author img

By

Published : May 4, 2021, 7:54 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో కోవిడ్ బాధితుల కోసం ఏపీ టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ సెంటర్​లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందించడం లేదని, అవసరమైన సిబ్బందిని అందించినప్పటికీ అధికారుల్లో సమన్వయ లోపం వల్ల సమస్యలు తలెత్తాయని సబ్​ కలెక్టర్​ కె. మయూర్ అశోక్ తెలిపారు. త్వరలోనే వాటిని సరిచేయనున్నట్లు ఆయన తెలిపారు.

సబ్​ కలెక్టర్​ కె. మయూర్ అశోక్
కోవిడ్​ కేర్​ సెంటర్లను సబ్​కలెక్టర్ పరిశీలన

గుంటూరు జిల్లా తెనాలిలో కోవిడ్ రెండో దశ వ్యాప్తి దృశ్యా... ఏపీ టిడ్కో గృహాలను కోవిడ్ కేర్ సెంటర్​గా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 700 మందికి పైగా బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. బాధితులు కేర్ సెంటర్లలో చేరే సమయంలో ముందుగా పేరును నమోదు చేసుకునే సమయంలో.. ప్రతి ఒక్కరికీ వెల్కమ్ కిట్ తో పాటు మందుల కిట్టు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కేంద్రంలోని బాధితులకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చినట్లు సబ్​ కలెక్టర్​ మయూరి అశోక్ స్పష్టం చేశారు.

సేవలపై రోగులను అడిగి తెలుసుకుని..

కానీ.. అధికారుల సమన్వయ లోపం వల్ల సకాలంలో బాధితులకు సేవలు అందించలేక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్​ నుంచి కోసుకుంటున్న వారిని ప్రతిరోజు డాక్టర్లు పరామర్శిస్తున్నారా? లేదా ? అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని రూములకు డాక్టర్లు వెళ్లడం లేదని తెలియడంతో వారిపై అసహనం వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించినప్పటికీ.. రోగులకు మెరుగైన సేవలు అందించలేక పోవడంపై అధికారులను ప్రశ్నించారు.

మున్సిపల్ సిబ్బందికి షోకాజ్​ నోటీసులు..

కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్లలో పని చేయడానికి కేటాయించిన మున్సిపల్​ సిబ్బంది అక్కడ విధులు నిర్వహించడానికి వెళ్లకపోవడంపై సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ రావును ఆరా తీశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఆయన అత్యవసర పరిస్థితుల్లో కూడా విధులకు హాజరుకాని ఆరుగురు సిబ్బందికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.

రెండు రోజుల్లో కొవిడ్ బాధితులకు సామాగ్రి పంపిణీ..

తెనాలి డివిజన్ పరిధిలోని సీహెచ్​సీలైన రేపల్లె, బాపట్ల, పొన్నూరు, కొలకలూరు, భట్టిప్రోలు, వేమూరు ప్రభుత్వ ఆసుపత్రులను కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్లుగా మార్పు చేసినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు. సీహెచ్​సీ ప్రభుత్వ ఆసుపత్రులకు వెల్కమ్ కిట్లు, హోమ్ ఐసోలేషన్ కిట్లు తరలించనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

'నందిగ్రామ్ రిటర్నింగ్​ అధికారికి పూర్తి భద్రత'

'ఆ స్థలం నాది... వేరే వ్యక్తితో ఆస్తి పన్ను కట్టించుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.