ETV Bharat / city

Statues: గుంటూరులో విగ్రహాల వివాదం... మెున్న బీపీ మండల్, నిన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - statue removal in Guntur turns controversial

Idol controversy in AP: గుంటూరు నగరంలో విగ్రహాల చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. అనుమతుల విషయంలో అధికారులు వ్యవహరిస్తోన్న తీరే దీనికి కారణంగా కనిపిస్తోంది. బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెను వారం రోజుల క్రితం కూల్చివేసిన అధికారులు.. తాజాగా ఎస్పీ బాలు విగ్రహాన్ని కూడా తొలగించారు. రాజకీయపార్టీ నేతల విగ్రహాల విషయంలో నిబంధనలు పట్టించుకోని అధికారులు, రాజ్యాంగ నిపుణులు, కళాకారుల విషయంలో ఆంక్షలు విధించి అడ్డుకోవటంపై విమర్శలు వస్తున్నాయి.

SP Balasubramanyam statue removal
గుంటూరులో విగ్రహాల వివాదం
author img

By

Published : Oct 5, 2022, 8:19 AM IST

Updated : Oct 5, 2022, 1:25 PM IST

గుంటూరులో విగ్రహాల వివాదం

Idol controversy in Guntur: గుంటూరులో విగ్రహాల వివాదం రాజుకుంది. అనుమతి లేదంటూ విగ్రహాల దిమ్మెలను నగరపాలక సంస్థ కూల్చివేయడం తీవ్ర వివాదస్పదమైంది. మొన్న బీపీ మండల్ విగ్రహం దిమ్మె.. నిన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరులో విగ్రహాల వివాదం రాజుకుంది. అనుమతి లేదంటూ విగ్రహాల దిమ్మెలను నగరపాలక సంస్థ కూల్చివేయడం తీవ్ర వివాదస్పదమైంది. మొన్న బీపీ మండల్ విగ్రహం దిమ్మె.. నిన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విగ్రహాల ఏర్పాటుని అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది: వారం రోజుల క్రితం బీపీ మండల్‌ విగ్రహం దిమ్మెను తొలగించిన నగరపాలక సంస్థ.. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగించడంపై విమర్శలు వచ్చాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు కళాదర్బార్‌ సంస్థ అనుమతి కోరగా నాజ్‌ సెంటర్‌లో ఏర్పాటుకు నగరపాలక సంస్థ అనుమతించింది. జూన్ 11న ఎస్పీ శైలజ చేతుల మీదుగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే నాజ్ సెంటర్ కూడలిని కుదిస్తున్నట్లు వార్తలు రావటంతో అక్కడ విగ్రహ ఏర్పాటుని కమిటీ విరమించుకుంది. అదే విగ్రహాన్ని ఈనెల 2వ తేదిన మదర్ థెరిస్సా కూడలి వద్ద ఏర్పాటు చేయగా.. నగరపాలక సంస్థ తొలగించింది. కనీస సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విధంగా వారం రోజుల క్రితం బీపీ మండల్ విగ్రహా ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెను సైతం తొలగించడం వివాదాస్పదమైంది. 6 నెలల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసిన నిర్వాహకులు.. గత నెల 25న విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. విగ్రహ ఏర్పాటు దిమ్మెను నిర్మిస్తే.. నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. కనీసం విగ్రహ కమిటికి గానీ, ప్రజాప్రతినిధులకు గానీ సమాచారం ఇవ్వలేదని నేతలు మండిపడ్డారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి మేరుగ నాగార్జున మరోసారి శంకుస్థాపనం చేసి.. ప్రభుత్వమే విగ్రహం ఏర్పటు చేస్తుందని తెలిపారు.

సుప్రీంకోర్టు నిబంధనలను పాటిస్తున్నట్లు తెలిపిన కమిషనర్: విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మండల్ విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవు. పైగా అది రోడ్డు మధ్యలో ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు. రింగురోడ్డు కూడలి వద్ద వాహనాల రద్దీ ఉంటుంది కాబట్టి అక్కడ విగ్రహ ఏర్పాటు సరికాదని అంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు విషయంలో నాజ్ సెంటర్లో అనుమతి కోసం దరఖాస్తు చేసి.. వేరేచోట ఏర్పాటు చేయటం వల్లే సమస్య వచ్చిందని చెబుతున్నారు. బి.పి.మండల్ విగ్రహ ఏర్పాటుకు కూడా అనుమతి తీసుకోవాలి సూచించినట్లు కమిషనర్ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 5, 2022, 1:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.