ETV Bharat / city

Robbery at Nadikudi Junction: నడికుడి రైల్వేస్టేషన్‌లో దోపిడీ..రూ.89 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు - Robbery at Nadikudi railway junction

Theft at Nadikude Jn: నడికూడి రైల్వే జంక్షన్‌లో దోపిడీ జరిగింది. రైలు ఎక్కేందుకు సిద్దంగా ఉన్న ప్రయాణికులపై దాడి చేసి.. రూ.89 లక్షలు ఎత్తుకెళ్లారు. ఘటనపై బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Robbery at Nadikude Jn
పోలీసులు పిలుస్తున్నారంటూ..నడికూడి రైల్వే జంక్షన్లో దోపిడీ...
author img

By

Published : Mar 8, 2022, 7:14 AM IST

Robbery at Nadikudi Jn: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికూడి రైల్వే జంక్షన్‌లో సినీఫక్కీలో దోపిడీ జరిగింది. సోమవారం రాత్రి రైలు ఎక్కేందుకు ప్లాట్​ఫామ్​లో ఉన్న ప్రయాణికులపై ఆరుగురు దుండగులు దాడి చేసి.. దోపిడీకి పాల్పడ్డారు. రెండు బ్యాగుల్లో ఉన్న రూ.89 లక్షలు ఎత్తుకెళ్లారు.

ఇదీ జరిగింది...

దుర్గి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెన్నై వెళ్లడానికి నడికూడి రైల్వేస్టేషన్‌ రెండో ప్లాట్‌ఫాంలో ఎస్‌ 6 బోగీ ఆగే ప్రదేశంలో రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో గోగులపాడు వెళ్లే రోడ్డు మార్గం నుంచి (రైల్వే ఖాళీ స్థలం) ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. ఆ ముగ్గురు ప్రయాణికులను కొట్టుకుంటూ పోలీసులు పిలుస్తున్నారని దూరంగా బలవంతంగా వారు తీసుకువెళ్లారు. ముగ్గురి దగ్గర ఉన్న రెండు బ్యాగులను లాక్కొని తెల్లకారులో పారిపోయారు. దుండగులు ఎత్తుకెళ్లిన సంచుల్లో రూ.89 లక్షలున్నట్లు సమాచారం.

ఈ నగదు మొత్తాన్ని వ్యాపార పనుల నిమిత్తం ప్రయాణికులు చెన్నై తీసుకెళ్తున్నారు. జరిగిన ఘటనపై రైల్వే పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా అప్రమత్తమై పల్నాడు ప్రాంతంలోని పలు పోలీసుస్టేషన్లకు సమాచారం ఇచ్చారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలు పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.