ETV Bharat / city

Red Sandalwood Seized: రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

author img

By

Published : Dec 7, 2021, 9:34 PM IST

Red Sandalwood Seized in Guntur: అక్రమంగా తరలిస్తున్న 211 ఎర్రచందనం దుంగలను నాగార్జున సాగర్ చెక్ పోస్టు వద్ద గుంటూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుంగల విలువ రూ. 20 లక్షలు ఉంటుందన్నారు.

red Sandalwood Seized at guntur district
ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Red Sandalwood Seized in Guntur: గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో.. పెద్దఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. రెండు ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల విలువైన 211 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ట్రక్కుల్లో చేపల మేత, ప్లాస్టిక్ వ్యర్థాల కింద ఎర్రచందనం దుంగలుంచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

red Sandalwood Seized at nagarjuna sagar check post
పెద్దఎత్తున పట్టబడ్డ ఎర్రచందనం దుంగలు

హైదరాబాద్ నుంచి మాచర్ల వైపు ఎర్రచందనం దుంగలు తరలించే క్రమంలో పోలీసులను చూసి కంగారుపడ్డ వాహనదారులు.. వాహనాలను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. ఇవి ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: maoists arrest in manyam : ముగ్గురు మహిళా మావోయిస్టులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.