రేడియో న్యూస్ రీడర్ ఏడిద గోపాలరావు కన్నుమూశారు. ఏడిద గోపాలరావు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడిగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు.
గోపాల రావు వివిధ సాంస్కృతిక సంస్థలు, సంఘాల కార్యక్రమాలకు ఇతోధిక సహాయ సహకారాలు అందించారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి