ETV Bharat / city

గుంటూరు సర్వజన ఆసుపత్రికి ఏమైంది..?

గుంటూరు సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగుల కష్టాలు పెరుగుతున్నాయి. అధునాతన వైద్యసేవలు అందుబాటులో ఉన్నా... వాటిని పొందాలంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. వైద్యులు, సిబ్బంది కొరత, ప్రణాళికా లోపాలు నిరుపేద వ్యాధిగ్రస్తులను యాతనకు గురిచేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే... ఆసుపత్రికి చెడ్డపేరు రావడానికి ఎక్కువ సమయం పట్టదని స్థానికులు చెబుతున్నారు.

గుంటూరు సర్వజన ఆసుపత్రి
author img

By

Published : Nov 11, 2019, 5:36 AM IST

గుంటూరు సర్వజన ఆసుపత్రి

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న... గుంటూరు సర్వజనాస్పత్రిలో సేవలు పొందడం పేదలకు కష్టతరంగా మారుతోంది. సిబ్బంది కొరత, ప్రణాళికా లోపాలతో... దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు యాతనలకు గురవుతున్నారు. ప్రత్యేక వైద్యసేవలకు జీజీహెచ్ పేరు పొందినందునా... నిత్యం 4వేల మంది వరకూ రోగులు ఆసుపత్రికి వస్తున్నారు.

ఈ ఆసుపత్రికి వచ్చినవారు ఓపీ చీటీ కోసం గంటన్నర... వైద్యుడిని కలిసేందుకు మరో గంటన్నర... ఇలా ఒక్కో వ్యక్తి 3 గంటల వరకూ లైనులో నిలబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. పరీక్షలు పూర్తి చేసుకొని మళ్లీ వైద్యుడిని కలవాలంటే... వారం రోజులైనా వేచి చూడాల్సిందే. ఎమ్మారై, ఈసీజీ, 2డీ ఎకో లాంటి పరీక్షల కోసమూ రోజుల తరబడి తిరగాల్సిందే.

వైద్యులు, సిబ్బంది కొరత ఈ పరిస్థితికి ప్రధాన కారణం కాగా... సమయపాలనా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 55 బోధనా నిపుణుల పోస్టులు ఖాళీగా ఉండటం మరో కారణం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే... సమస్యలు చాలావరకూ తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1848లో ఓ చిన్న గదిలో ప్రారంభమై... ఉత్తమ సేవలతో సుమారు 170 ఏళ్ల ఆరోగ్య చరిత్ర సొంతం చేసుకున్న జీజీహెచ్ అభివృద్ధికి... చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

AP_GNT_02_10_GGH_LO_AVASTHALU_PKG_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: KESAVA RAO Anchor: గుంటూరు సర్వజనాస్పత్రిలో రోగుల కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అధునాతన వైద్యసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని అందుకోవాలంటే రోగులు గంటల తరబడి నిరక్షించాల్సిందే. ఆరోగ్య పరీక్షలు, వైద్యుల సలహాలు, మందులు పొందాలంటే గంటల తరబడి ఆగాల్సిందే. గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్, నరాల సంబంధిత సమస్యల నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావాలంటే రోజులు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. వైద్యులు, సిబ్బంది కొరతతోపాటు... అధికారుల ప్రణాళికాలోపం....రోగుల పాలిట శాపంగా మారుతోంది...LOOK... VO1: కోస్తాంధ్ర ఆరోగ్య ప్రదాయనిగా పేరుగాంచిన గుంటూరు సర్వజనాస్పత్రికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. 1848లో ఓ చిన్న గదిలో ప్రారంభమైన ఈ ఆస్పత్రి... క్రమంగా విస్తరించింది. 1954లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధ బోధనాస్పత్రిగా మారడంతో బెడ్స్ సంఖ్య 1038కి పెరిగింది. భారత వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా 1999లో 1177 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. 2011లో పొదిలి ప్రసాద్ విభాగం ఏర్పాటుతో మరో 246 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యసేవల విస్తరణతో రోగుల తాకిడి పెరిగింది. జీజీహెచ్ లో ఇప్పటివరకు 4 గుండెమార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశారు. మరో 550 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 20 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, 100కి పైగా మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఇక చిన్నాచితక ఆపరేషన్ల సంగతి సరేసరి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక వైద్యసేవలకు జీజీహెచ్ పేరు పొందడంతో ఈ తాకిడి రోజురోజుకీ పెరుగుతోంది. రోజుకి ఓపీ 3వేల500 నుంచి 4వేల వరకు ఉంటుంది. వచ్చే రోగులు ఓపీ చీటీ కోసమే గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. తర్వాత ఓపీ చీటీతో క్యూలైనులో నిల్చొని వైద్యున్ని కలవడానికి మరో గంటన్నర సమయం పడుతుంది. వెరసి సగటున ఒక్కో వ్యక్తి సగటున మూడు గంటలు క్యూలో నిల్చోవాల్సిందే. ఇక గర్భవతులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో వచ్చేవారి పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆఖరి మెట్టులో వైద్యుని దగ్గరకు చేరుకుంటే... దేవుడిని దర్శించుకున్నఅనుభూతి. తీరా వైద్యుడిని కలిశాక.... రక్త,మూత్ర పరీక్షలను సూచిస్తారు. ఇవి పూర్తి చేసుకుని వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంటతో ఓపీ పూర్తయి వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుని వచ్చిన రోగులకు మళ్లీ వారం రోజుల తర్వాతే రమ్మంటున్నారు. ఏ డాక్టర్ ఆరోగ్య పరీక్షలు రాశారో... మళ్లీ వారే చూస్తారని చెప్పడంతో.... విధి లేక రోగులు వారం తర్వాతే రావాల్సి వస్తుంది. ఇక ఎమ్మారై, ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షల కోసం రోజుల తరబడి తిరగాల్సిందే. వైద్యులు, సిబ్బంది కొరత ప్రధాన కారణమైతే.. కొరవడిన సమయపాలన రెండో కారణం. బయో మెట్రిక్ నామమాత్రంగా మారిపోయింది. సమారుగా 55 బోధనా నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మందులు పొందేందుకు సైతం రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిందే. కౌంటర్లు తగినన్ని లేక సగం కాలం అక్కడే గడపాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. మరోవైపు మందులు సైతం అరకొరగా ఇస్తున్న తరుణంలో బయట ప్రైవేటుగా కొనుక్కోక తప్పడం లేదని రోగులు,బంధువులు వాపోతున్నారు....SPOT+VOXPOP... V.O.2: గుంటూరు సర్వజనాస్పత్రికి వేలలో రోగులు, వారి బంధువులు వస్తుండటంతో రోజూ కిటకిటలాడుతుంది. కొత్తగా ఎంసీహెచ్ వంటి భవనాల నిర్మాణం పూర్తయితే... వైద్యులు, వసతుల సమస్యకు పరిష్కారం లభించే అవకాశముందని చెబుతున్నారు. జీజీహెచ్ కు బొంగరాల బీడు వద్ద 6 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ కొన్ని విభాగాలను అక్కడికి తరలిస్తే జీజీహెచ్ పై కొంత ఒత్తిడి తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మందులు ఇచ్చే కౌంటర్ల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు హామీ ఇస్తున్నారు...BYTE.... BYTE: బాబూలాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు E.V.O.:......................REPORTER PTOC.........END..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.