ETV Bharat / city

రైట్​ రైట్... రోడ్డెక్కుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు

కరోనా లాక్​డౌన్ కాలంలో గ్యారేజీలకే పరిమితమైన ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు రోడ్డెక్కాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు రెండు నెలల కిందటే అనుమతి వచ్చినా... ప్రయాణికులు లేక బస్సులు పెద్దగా బయటకు రాలేదు. అన్ని రకాల కార్యకలాపాలు పుంజుకోవటంతో ప్రైవేటు బస్సులన్నీ రోడ్డెక్కించేందుకు యజమానులు యత్నిస్తున్నారు. కొవిడ్ నిబంధనల మేరకే బస్సుల నడపాలని అధికారులు సూచిస్తున్నారు.

Private Travels Buses Starts From Andhra Pradesh
రైట్​ రైట్... రోడ్డెక్కుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు
author img

By

Published : Oct 3, 2020, 9:00 PM IST

దూరప్రాంతాలకు ప్రయాణికుల్ని చేరవేయటంలో ఆర్టీసీకి సమాంతరంగా రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై మరికొన్ని నగరాలకు బస్సులు నడిచేవి. అయితే కరోనా లాక్ డౌన్ నుంచి బస్సులన్నీ గ్యారేజీలకే పరిమితమయ్యాయి. దాదాపు వెయ్యి వరకూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. వీటిలో వివాహాలు, తీర్థయాత్రలకు వెళ్లేవి రెండు వందల వరకూ మినహాయిస్తే... మిగతావన్నీ ప్రయాణికుల్ని దూరప్రాంతాలకు చేరవేసేవే.

కేంద్రం అనుమతులు.. రాష్ట్రం పచ్చజెండా

అన్ లాక్-4లో భాగంగా రాష్ట్రాల మధ్య ప్రైవేటు ట్రావెల్స్ కు కేంద్రం అనుమతించింది. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు విధించి ప్రైవేటు బస్సులకు పచ్చజెండా ఊపింది. అయితే కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు మాస్క్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

ఇప్పుడిప్పుడే...

అయితే... కరోనా భయంతో మొదట్లో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకే పెద్దగా ఆసక్తి చూపలేదు. అన్నిరకాల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కావటంతో ఆర్టీసి బస్సులను కూడా అన్ని ప్రాంతాలకు నడుపుతున్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ కూడా పూర్తిస్థాయిలో నడిపేందుకు వాటి యజమానులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. చెన్నైలో ఇంకా ప్రజారవాణాకు అనుమతి ఇవ్వకపోవటంతో అటువైపు సర్వీసులు లేవు. అలాగే మిగతా రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు కూడా ప్రస్తుతానికి బస్సులు నడపటం లేదు.

హైదరాబాద్ వైపు...

బస్సులను లాడ్ డౌన్ సమయంలో గ్యారేజీలకే పరిమితం చేసిన తరుణంలో వాటికి సంబంధించిన పన్నులు మినహాయించారు. అవి మళ్లీ రోడ్డెక్కుతుండటంతో ట్రావెల్స్ నిర్వాహకులు రవాణాశాఖ వద్ద అనుమతులు తీసుకుంటున్నారు. అవి తిరిగే రూట్ల ప్రకారం పన్నులు చెల్లింపు, ఇతర అనుమతులు పొందుతున్నారు. ప్రస్తుతం ఏపీ-తెలంగాణా మధ్య ఆర్టీసీ సర్వీసులు లేకపోవటం ప్రైవేటుకు కలిసొచ్చింది. మన రాష్ట్రం నుంచి హైదరాబాద్​కు సర్వీసులు తిప్పేందుకు ట్రావెల్స్ వారు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణికులను బస్సుల్లో ఎక్కిస్తున్నారు. కరోనా దెబ్బకు కుదేలైన రవాణా రంగాన్ని ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

బస్సుల్లో భౌతికదూరం విషయంలో ఆర్టీసి నిబంధనలు ఎత్తివేసింది. అన్ని సీట్లలో ప్రయాణికులను అనుమతిస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ విషయంలో ఇంకా దానికి సంబంధించి స్పష్టత లేదు. ప్రయాణికుల సంఖ్య కొంచెం తక్కవగా ఉండటంతో సీట్లు ఖాళీగా వదులుతున్నారు.

ఇదీ చదవండి:

సబ్బంహరి ఇంటిని కూల్చడంపై అంత సైకోయిజం ఏంటి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.