రాష్ట్రంలో కరోనా కేసులు కట్టడి చేయడంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొవిడ్ పరీక్షలు నిర్వహించడంలోనూ, పాజిటివ్‌గా తేలినవారికి అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రభుత్వ చర్యలు సరిగా లేవని.. ఏపీ పౌర హక్కుల సంఘం పిటిషన్లో పేర్కొంది. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఎక్కువగా బయట తిరగకుండా కట్టడి చేయలేదని ఆరోపించింది.
విద్యా సంస్థలు ఇంకా నడుపుతూ ఉండటం.. ప్రత్యామ్నాయ విధానాలు పాటించకపోవడంపై ఆక్షేపణ విధించింది. ప్రభుత్వ తీరు కారణంగానే కరోనా కేసులు ఎక్కువగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి సురేశ్ ఆరోపించారు. తమ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాతో ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు మృతి