Pedanandipadu Education Charitable Society: గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ సొసైటీని..11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని ఎంపిక చేస్తూ.. ప్రోత్సహిస్తున్నారు. వారి ఉన్నత చదువులకు ఉపకార వేతనాలు అందించాలనే ఆలోచనలతో.. కొందరు తన దగ్గరకు వచ్చారని.. ఆ నిర్ణయాన్ని స్వాగతించి ప్రోత్సహించినట్లు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు వెల్లడించారు. ఆర్నెళ్లలో ఉద్యోగ విరమణ తర్వాత.. ట్రస్టుతో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సాయం చేసినవారిని, పుట్టిన గ్రామాన్ని, గురువులు, తల్లిదండ్రులను మర్చిపోకూడదని జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు.
ఇదీ చదవండి : Power Cut To Municipal Office : విద్యుత్ బకాయిలు చెల్లించని మున్సిపల్ కార్యాలయం...నిలిచిన సరఫరా ...
"ఈ సొసైటీని మొదలు పెట్టినప్పుడు నా దగ్గరకి వచ్చినపుడు దీన్ని ముందుకు తీసుకెళ్లమని నేను కూడా ప్రోత్సహించాను. నాటి నుంచి ఈ సొసైటీని నిర్లక్ష్యం చేయకుండా నిరంతరాయంగా విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చి సాయమందించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇక్కడితో ఈ సాయాన్ని ఆపకుండా మరింత మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలనేది నా కోరిక. నేను మరో ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్నాను. తరువాత వీరితో కలిసి పూర్తి స్థాయిలో పనిచేయాలని భావిస్తున్నాను. సాయం అందించిన వారిని,సంస్థను ఎప్పటికీ మరిచిపోకూడదు. మీరు ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత మీలాంటి వారికి మీవంతుగా సేవలందించాలి. పుట్టిన ఊరిని, సాయం అందించిన మనుషుల్ని అస్సలు మర్చిపోకూడదు. " -జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
" పెదనందిపాడు ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ సొసైటీ విద్యా ప్రాముఖ్యాన్ని గుర్తించి..చదువుకోలేని పేద విద్యార్థులకు వీలైనంత సాయం అందిస్తోంది. వారు అభివృద్ధి చెంది సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో స్థాపించాం. " -శేషగిరిరావు, అధ్యక్షుడు పెదనందిపాడు ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ సొసైటీ
ఈ సోసైటీ ద్వారా ఇప్పటివరకు 600 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ట్రస్టు ద్వారా లబ్ధి పొంది..ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారందరూ తిరిగి సహకారం అందిస్తున్నారని సొసైటీ నిర్వాహకులు వివరించారు.
ఇదీ చదవండి : Employees Relay fasting initiations : ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి...
" దాదాపు 600 మంది పేద, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాము. ఇలా విద్య కొనసాగించిన వారిలో అనేక మంది జీవితాల్లో స్థిరపడ్డాక తిరిగి ఈ సొసైటీకి తమ లాంటి వారి కోసం ఈ సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. " -కృష్ణ, కార్యదర్శి పెదనందిపాడు ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ సొసైటీ
" రానున్న రోజుల్లో కూడా ప్రతిభ గల పేద విద్యార్థులకు ఇలాగే సహాయం అందించాలని కోరుకుంటున్నాం. దాతలు అందిస్తున్న మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్లు చేసి వచ్చే వడ్డీతో ప్రతీ ఏటా 5 నుంచి 6 లక్షల రూపాయలను దాదాపుగా 40-50 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలుగా అందిస్తున్నాం." -రాఘవయ్య, సభ్యుడు పెదనందిపాడు ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ సొసైటీ
ఇదీ చదవండి : పీఆర్సీ వ్యాజ్యం మరోసారి సీజే నిర్ణయానికి
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!