NIA searches: గుంటూరులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంగడిగుంటకు చెందిన డ్రైప్రూట్స్ వ్యాపారి జఫ్రుల్లాఖాన్తోపాటు పొత్తూరువారితోటకు చెందిన రహీం, వహీద్లను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా... పీఎఫ్ఐ కార్యకలాపాలపై, ముగ్గురు వ్యక్తులకు ఆ పార్టీతో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముగ్గురు వ్యక్తల విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.
కర్నూలు నగరంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. నగరంలోని ఖడక్ పూర వీధిలోని ఎస్డీపీఐ నాయకులు అబ్దుల్ వారిస్ ఇంటిలో ఎన్‌ఐఏ అధికారులు తెల్లవారుజామున సోదాలు చేశారు. అబ్దుల్ వారిస్కు హైదరాబాదులో ఇళ్లు ఉండటంతో కర్నూలు, హైదరాబాద్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎన్‌ఐఏ సోదాలకు వ్యతిరేకంగా ఎస్డీపీఐ నాయకులు నిరసన తెలిపారు. భాజపా ఎన్‌ఐఏ సంస్థను అడ్డుపెట్టుకుని కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎన్‌ఐఏ అధికారులకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి:
RTC bus stand closed: అద్దె చెల్లించలేదని ఆర్టీసీ బస్టాండ్ మూసివేత
CAG reports: ఏపీని ముంచబోతున్న అప్పులు.. కాగ్ నివేదికల్లో వాస్తవాలు