MEMORIAL AWARD: ప్రజాశక్తి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డులను గుంటూరుకు చెందిన ఇద్దరు ‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటర్లు అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ సభను వైయస్‌ఆర్ జిల్లా కడప జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి, ఎంహెచ్ అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్ తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ కార్యదర్శి ఎంవీఎస్ శర్మ హాజరయ్యారు.
మోటూరు ఎంతోమంది జర్నలిస్టులకు, వామపక్ష ఉద్యమాలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారని కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. మోటూరు నెలకొల్పిన విలువలు, ఒరవడి, పాత్రికేయ సంప్రదాయాలు నేటికీ గీటురాళ్లుగా నిలిచి ఉన్నాయని కవి, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పేర్కొన్నారు. అనంతరం గుంటూరుకు చెందిన ‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటర్లు దాసరి అజయ్‌బాబు, భాస్కర్‌రావులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు మోడెం వీరాంజనేయ ప్రసాద్, కందుల చంద్రఓబుల్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: