ETV Bharat / city

'ప్ర‌జ‌ల సొమ్ము వేతనంగా తీసుకుని తాడేప‌ల్లి కొంప‌కి చాకిరీ చేయ‌డమా..?'

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్​ వేదికగా మండిపడ్డారు. ప్ర‌జ‌ల సొమ్ము జీతంగా తీసుకుని తాడేప‌ల్లి కొంప‌కి చాకిరీ చేయ‌డానికి సిగ్గులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాపై పోస్టులు పెట్టారని తాము కేసులు పెడితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతమందిని అరెస్ట్ చేశారని లోకేశ్ ప్రశ్నించారు. కుల‌పిచ్చి ఉంటే ఖాకీ డ్రెస్ తీసి.. బులుగు కండువా కప్పుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు.

నారా లోకేశ్ ట్విటర్
నారా లోకేశ్ ట్విటర్
author img

By

Published : May 19, 2021, 5:12 PM IST

Updated : May 19, 2021, 5:26 PM IST

జగన్మోహన్ రెడ్డి ద‌గ్గ‌ర ప‌నిచేయాల‌నే ఉత్సాహం, కుల‌పిచ్చి ఉంటే గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప‌విత్ర‌మైన ఖాకీ డ్రెస్ తీసి.. బులుగు కండువా కప్పుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అరండల్​పేట పోలీసు స్టేషన్ వద్ద ఎస్పీ పెట్టిన మీడియా సమావేశం వీడియోను తన ట్విటర్​కు జత చేశారు లోకేశ్. ప్ర‌జ‌ల సొమ్ము వేతనంగా తీసుకుని తాడేప‌ల్లి కొంప‌కి చాకిరీ చేయ‌డానికి సిగ్గులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోష‌ల్‌ మీడియాలో వీడియో పెట్టిన‌వాళ్ల‌ని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదుల్ని అరెస్ట్ చేసిన‌ట్టు ఏంటా ఓవ‌రాక్ష‌న్‌ అని నిలదీశారు. తెదేపాపై పోస్టులు పెట్టారని తాము కేసులు పెడితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతమందిని అరెస్ట్ చేశారని లోకేశ్ ప్రశ్నించారు. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై కేసు పెట్ట‌డానికి వ‌చ్చిన‌వారిపైనే రివ‌ర్స్ కేసు బ‌నాయించారని మండిపడ్డారు.

  • ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నింట్లో అరెస్ట్‌లు చేశారు? మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై కేసు పెట్ట‌డానికి వ‌చ్చిన‌వారిపైనే రివ‌ర్స్ కేసు బ‌నాయించారు. @ysjagan ద‌గ్గ‌ర ప‌నిచేయాల‌ని అంత ఉత్సాహం, కుల‌పిచ్చి ఉంటే.. ప‌విత్ర‌మైన ఆ ఖాకీ డ్రెస్ తీసేసి, బులుగు కండువా కప్పుకొండి.(2/2)

    — Lokesh Nara (@naralokesh) May 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండీ... ప్రాథమిక హక్కులు హరించేలా పోలీసుల తీరు: డీజీపీకి లేఖలో చంద్రబాబు

Last Updated : May 19, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.