కరోనా బాధితులకు 43 ప్లాస్మా యూనిట్స్ ఇప్పించిన వాసవి క్లబ్ నిర్వాహకులను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సత్కరించారు. గుంటూరు శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా వంటి మహమ్మారిని నివారించడంలో ప్లాస్మా థెరపీ ఎంతో కీలమని ఎమ్మెల్యే అన్నారు.
ప్లాస్మా దానం చేసి కరోనా బాధితులను ఆదుకుంటున్న దాతలను, వారిని ప్రోత్సహించిన వాసవీ క్లబ్ సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. యువత సైతం ప్లాస్మా దానానికి ముందుకు వచ్చి కోవిడ్ బాధితులను ఆదుకోవాలన్నారు. అనంతరం 7 సార్లు ప్లాస్మా దానం చేసిన ప్రసాద్ మాట్లాడారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ దానానికి ముందుకు రావాలన్నారు.
ఇదీ చదవండి: