ETV Bharat / city

'దెబ్బతిన్న పంటల కొనుగోలుపై త్వరలో నిర్ణయం' - రబీ సీజన్ ప్రణాళిక వార్తలు

ఏ ఏడాది పంట నష్టపోతే అదే ఏడాదిలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రబీ సీజన్ ప్రణాళికపై అధికారులతో సమావేశమైన మంత్రి... 6 జిల్లాల్లో రబీ పంటల సాగు, మార్కెటింగ్​పై చర్చించారు. రైతులు ఏ పంట పండించినా మార్కెటింగ్ సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. 62 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఐదు వేలకు పైగా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ఆయన... మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తామని హామీఇచ్చారు. విత్తనోత్పత్తి విధానం తీసుకురానున్నట్లు తెలిపారు.

kannababu
kannababu
author img

By

Published : Nov 6, 2020, 3:28 PM IST

Updated : Nov 6, 2020, 8:15 PM IST

రబీ సీజన్​కు సంబంధించిన ప్రణాళిక ఖరారు చేసేందుకు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రబీ సీజన్ ప్రణాళికపై వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమావేశంలో చర్చించారు. ఆరు జిల్లాల్లో రబీ పంటల సాగు, మార్కెటింగ్‌పై ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి కన్నబాబు తెలిపారు. వరి 62 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

"మొక్కజొన్న 2.60 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. రైతులు ఏ పంట పండించినా మార్కెటింగ్ సమస్య లేకుండా చర్యలు చేపడతాం. ఐదు వేలకు పైగా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరకు పంటల కొనుగోళ్లు చేస్తాం" - కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖామాత్యులు

ఏ ఏడాది పంట నష్టపోతే అదే ఏడాది పెట్టుబడి రాయితీ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. అక్టోబరు పంట నష్టం పరిహారాన్ని నవంబరులో రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.510 కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.

వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటల కొనుగోలుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి... కొత్తగా విత్తనోత్పత్తి విధానం తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. విత్తనాలు ఉత్పత్తి చేసే వారు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

దుర్గమ్మ ఆలయమా.... వైకాపా కార్యాలయమా?: పోతిన మహేష్

Last Updated : Nov 6, 2020, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.