ETV Bharat / city

గత ప్రభుత్వం చేపట్టిన ఇళ్లను పేదలకు అందిస్తాం: బొత్స - గుంటూరులో మంత్రి బొత్స పర్యటన

గుంటూరు మార్కెట్ స్థలాన్ని బిల్డ్ ఏపీ నుంచి మినహాయిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నగరంలో పర్యటించిన ఆయన.. పేదలకు అందించే ఇళ్ల స్థలాలను పరిశీలించారు. మార్కెట్​ స్థలాల్ని అభివృద్ధి చేసి వ్యాపారులకు అందిస్తామని బొత్స హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఇళ్లను మూడు దశల్లో పేదలకు అందిస్తామన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jun 15, 2020, 4:36 PM IST

గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మార్కెట్ స్థలాన్ని బిల్డ్ ఏపీ నుంచి మినహాయించినట్లు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గుంటూరు శివార్లలోని వెంగలాయపాలెంలో పేదలకు ఇళ్లు నిర్మించే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అందుకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడిన బొత్స... గుంటూరు మార్కెట్ స్థలం ప్రభుత్వానిదేనని, ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి వ్యాపారులకు ఇస్తామని హామీ ఇచ్చారు.

నలుగురికి మంచి జరుగుతుందంటే ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటారని బొత్స స్పష్టం చేశారు. ఇళ్లు లేని పేదల సొంతింటి కల నెరవేరుస్తామని... అందుకోసం మూడు విభాగాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ దశల్లో ఆగిన నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు ఇస్తామని తెలిపారు. అందులో మొదటి కేటగిరి లబ్ధిదారులు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. మిగతా రెండు విభాగాల వారు చెల్లించాల్సిన మొత్తం కూడా గతం కంటే తగ్గించినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేను వెళ్లలేదు: రఘరామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.