Mangalagiri court judge on Tulluru police: గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులపై మంగళగిరి కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కొట్టిన కేసులో పోలీసులపై చర్యలకు ఆదేశించారు. ఓ కేసులో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. రాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని నిందితులు.. జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో నిందితులను వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు పంపగా.. నిందితులకు గాయాలు ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులపై ఆగ్రహించిన జడ్డి.. నిందితుల రిమాండ్ రద్దు చేసి విడుదల చేయాలని ఆదేశించారు. నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి..
థియేటర్లలో సౌకర్యాలపై తనిఖీలు.. బొమ్మరిల్లు మినీ థియేటర్ సీజ్!