గుంటూరులో కరోనా లాక్డౌన్ నాటినుంచి మూసి ఉన్న మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని దుకాణాలను తెరచినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో 2 నెలల కిందటే మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. గుంటూరు, నరసరావుపేట, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి వంటిచోట్ల కరోనా కేసులు ఎక్కువగా ఉండగా... మద్యం దుకాణాలు తెరవలేదు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అన్ని చోట్లా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. మద్యం కోసం జనం ఎగబడ్డారు. గుంటూరులో పరిస్థితిని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు.
ఇదీ చదవండీ... రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోదే - కేంద్రం