ETV Bharat / city

Lalpuram farmers struggle: ప్రభుత్వానికి భూములిచ్చి.. పరిహారం కోసం ఎదురుచూపులు

నవరత్నాల కోసం భూములు సేకరించారు. మంచి ప్యాకేజీ ఇస్తామని ఆశ పెట్టారు. భూముల డాక్యుమెంట్లు తీసుకుని ఏడాది దాటినా పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థలాల్లోనే అధికారుల కోసం నివాసాలు నిర్మిస్తామని.. ఇంకా పెద్దమొత్తం చెల్లిస్తామని మరో మాట చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో తెలియక రైతులు నిశ్చేష్టులయ్యారు. సాగుకు పొలం లేక.. ఇటు పరిహారం అందక అయోమయంలో పడిపోయారు. అప్పుల ఊబిలో చిక్కి విలవిల్లాడుతున్నారు.

Lalpuram farmers struggle for compensation
పరిహారం కోసం పడిగావులు కాస్తున్న లాల్‌పురం రైతులు
author img

By

Published : Sep 17, 2021, 7:12 AM IST

పరిహారం కోసం లాల్​పూరం రైతుల పడిగాపులు

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గృహాల నిర్మాణానికి గుంటూరు గ్రామీణ మండలం లాల్‌పురం (lapuram) గ్రామ రైతుల నుంచి ప్రభుత్వం 150 ఎకరాలు తీసుకుంది. భూమి విలువ ఆధారంగా ఎకరాకు 78 లక్షల రూపాయలు చెల్లిస్తామని అధికారులు చెప్పారు. వారి మాటలు నమ్మిన రైతులు.. అప్పులు చేసి మరీ బ్యాంకులకు డబ్బులు చెల్లించారు. అక్కడ తనఖా పెట్టిన డాక్యుమెంట్లను తీసుకొచ్చి అధికారులకు అప్పగించారు. రైతుల నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు తీసుకున్న అధికారులు.. భూములు సేకరించినట్లు రైతులకు అఫిడవిట్లు కూడా అందజేశారు. రెండు వారాల్లో పరిహారం అందిస్తామని నమ్మబలికారు. ఇదంతా జరిగింది 2020 జూన్‌లో. ఏడాది దాటినా రైతుకు పైసా పరిహారం(Lalpuram farmers struggle for compensation) అందలేదు. సాగుకు పొలం లేక.. ఇటు పరిహారం అందక అయోమయంలో పడిపోయారు. అప్పుల ఊబిలో చిక్కి విలవిల్లాడుతున్నారు.

కళ్లు కాయలు కాసేలా ఎదురుచూలు..

వేర్వేరు ప్రాంతాల్లో భూములు సేకరించి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ విషయంపై రైతులు అధికారుల్ని ప్రశ్నిస్తే... మధ్యతరగతి వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం లాల్‌పురం భూములు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎకరాకు కోటి 10 లక్షల వరకూ పరిహారం వస్తుందని హామీ ఇచ్చారు. అప్పటినుంచి డబ్బుల కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. పొలాలు బీళ్లు వారాయి. సాగు మూలన పడింది. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, బతుకు భారంగా మారిందని రైతులు వాపోతున్నారు.

ఆమోదించిన మేరకు ధర చెల్లింపు..

ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం గుంటూరు పశ్చిమ తహసీల్దార్ పరిధిలో ఉంది. రైతులు రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. భూముల ధరపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. రైతుల అభిప్రాయంతో గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఇచ్చే నివేదిక, భూముల విలువ గురించి జిల్లా రిజిస్ట్రార్‌ అభిప్రాయం కలిపి కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపిస్తే.. అక్కడ ఆమోదించిన మేరకు ధర చెల్లిస్తామన్నారు. ఇదంతా త్వరగా ముగించి, పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

ఆ ఉద్దేశమేనా..?

గతానికంటే ఎక్కువ పరిహారం వస్తుండటం వల్ల అధికార పార్టీ నేతలు ఈ వ్యవహారంలో చొరబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరిగిన పరిహారాన్ని తమ జేబుల్లో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పరిహారం ఆలస్యం చేస్తే రైతులు(farmers) దిగొచ్చి ఎంతో కొంతకు అంగీకరిస్తారనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి..

SEC: హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల ఫలితాలపై ఎస్‌ఈసీ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.