వైకాపా పాలన పట్ల ప్రజలు కోపంతో ఉన్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో .. ముఖ్యమంత్రి జగన్పై ఆయన విమర్శలు గుప్పించారు. కేవలం ప్రభుత్వ పథకాల పేర్లలో మాత్రమే జగనన్న కనబడతాడని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఈ అన్న ఎవరికీ కనబడడు, వినబడడు, ఓదార్చడు అని వ్యాఖ్యానించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు పేపర్ ప్రకటనల్లో మాత్రమే దర్శనమిస్తారని దుయ్యబట్టారు. ప్రజల్లో వైకాపాకు ఆదరణ ఉంటే స్థానికంగా దాడులకు ఎందుకు పాల్పడుతున్నారంటూ ప్రశ్నించారు.
ఇదీచదవండి.