ఇదీ చదవండి :
మిరప రైతులకు సలహాల కోసం.. నిరంతర సేవా కేంద్రం
ఐటీసీ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మిరప రైతుల సాగు సమస్యలు నివృత్తి చేసేందుకు గుంటూరులో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మంత్రి కన్నబాబు ప్రారంభించారు. మిరప రైతులను చైతన్యం చేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్న కన్నబాబు... ఈ తరహా కార్యక్రమాలు ఇతర పంటలకు విస్తరిస్తామన్నారు.
మిరప రైతుల సాగుసలహాల కోసం నిరంతర సేవాకేంద్రం
ఐటీసీ సంస్థ.. మిరప రైతులకు సాగులో ఎదురయ్యే సమస్యల నిర్మూలన, మేలైన యాజమాన్య పద్ధతులను వివరించే నిరంతర స్వర ఆధారిత సేవాకేంద్రం (కాల్ సెంటర్)ను గుంటూరులో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రారంభించారు. ఉద్యానశాఖ, ఉద్యానవర్సిటీ సహకారంతో.. రైతులకు ఏడాది పొడవునా ఈ కాల్ సెంటర్ ద్వారా సలహాలు అందజేస్తారు. వ్యవసాయ పట్టభద్రులు.. రైతుల సమస్యలను నివృత్తి చేస్తారు. ఐటీసీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిరప రైతులను చైతన్యం చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. మిరప పంటతో మొదలైన ఈ తరహా కార్యక్రమాలను.. అన్ని పంటలకు దశల వారీగా విస్తరిస్తామని ఆయన అన్నారు.
ఇదీ చదవండి :
sample description