ETV Bharat / city

నోటీసులు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేత... స్థానికుల ఆగ్రహం - houses demolishesd by guntur municipal officers

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను తొలగించడం దారుణమంటూ గుంటూరులో స్థానికులు ఆందోళన చేశారు. గత పదేళ్లుగా నగర శివారులో పక్కా రిజిస్ట్రేషన్​తో నివాసముంటున్న తమ ఇళ్లను మున్సిపల్​ అధికారులు కూల్చివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

houses removed by municipal oficers in guntur with out any notice
నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చుతున్న మున్సిపల్​ అధికారులు
author img

By

Published : Jun 26, 2020, 3:42 PM IST

Updated : Jun 26, 2020, 4:41 PM IST

గత పదేళ్లుగా నివాసముంటున్న తమకు ఎటువంటి నోటీసు లేకుండా ఇళ్లు తొలగించటం దారుణమంటూ గుంటూరులో స్థానికులు ఆందోళన చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్​ సమీపంలో నిర్మించుకున్న ఇళ్లను మున్సిపల్​ అధికారులు తొలగించారు. పక్కా రిజిస్ట్రేషన్​ ఉన్న భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే ఏ విధంగా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఇళ్లను తిరిగి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : ఈ భూముల్లో ఇళ్లు ఎలా కట్టుకుంటారు..?

Last Updated : Jun 26, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.