సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (narendra kumar)కు... మే 24న మంజూరు చేసిన బెయిల్(bail) ను రద్దు చేయాలని కోరుతూ అనిశా గుంటూరు డీఎస్పీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. బెయిల్ మంజూరు సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘించారని అనిశా తరఫు న్యాయవాది (ACB lawyer) వాదనలు వినిపించారు. బెయిల్‌పై విడుదలయ్యాక సంగం బోర్డు(sangam board) డైరెక్టర్లు, ఇతర అధికారులతో నరేంద్రకుమార్ సమావేశం నిర్వహించారని కోర్టుకు తెలిపారు.
గోపాలకృష్ణతో పాటు మరో25 మందితో నరేంద్ర కుమార్ నిర్వహించిన సమావేశం ద్వారా దర్యాప్తు ప్రభావితమవుతుందని అనిశా తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. నిబంధనల ప్రకారమే ధూళిపాళ్ల నరేంద్ర వ్యవహరించారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం... ఏసీబీ పిటీషన్‌ను కొట్టేసింది.
ధూళిపాళ్లకు బెయిల్...
సంగం డెయిరీ కేసులో తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరైంది. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల్‌కృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. వారికి బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని.. నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:
Visakha steel protest: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోం: మంత్రి అవంతి