ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును దేవదాయ చట్ట ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలంటూ ఇచ్చిన తాఖీదును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి , కమిషనర్ , తదితరులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 15 కు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకటరమణ ఆదేశాలిచ్చారు. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం ట్రస్టు ఏర్పాటు చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ట్రస్టుపై నియంత్రణ సాధించడం కోసం ప్రభుత్వం, దేవాదాయశాఖ.. నోటీసు ఇచ్చిందన్నారు. రిజిస్టర్ చేసుకుంటే కార్యనిర్వహణ అధికారినీ నియమించి ప్రభుత్వ నిర్వహణ మార్చాలని చూస్తోందన్నారు. గతంలోనూ సంగం చెయిరీని స్వాధీనం చేసుకునేందుకు చట్టవిరుద్ధంగా ప్రయత్నించగా న్యాయస్థానం అడ్డుకుందన్నారు.
ఇదీ చదవండి: గుడివాడ ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు!