గుంటూరులోని పోలీసు మైదానంలో రౌడీ షీటర్లకు పోలీసు ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ఘటనలు, మత్తు పదార్థాల విక్రయాలు ఇటీవల ఎక్కువ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. నగర పరిధిలో ఏ, బీ, సీ కేటగిరీకి చెందిన సుమారు 700 మందికి.. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నేరుగా కౌన్సెలింగ్ ఇచ్చారు.
తరచుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదని.. సత్ప్రవర్తన అలవరచుకోకపోతే నగర బహిష్కరణ విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని తెలిపారు. ఎలాంటి నేరాలకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
టిప్పర్ - ఆర్టీసీ బస్సు ఢీ.. డ్రైవర్ మృతి, 8మందికి తీవ్రగాయాలు