ETV Bharat / city

ఆ ముగ్గురికీ కరోనా వ్యాప్తి ఇలా..! - గుంటూరు కొవిడ్ అప్ డేట్

దిల్లీతో పాటు విదేశీ పర్యటనల నేపథ్యం లేకపోయినా జిల్లాలోని పొన్నూరు, నరసరావుపేట, దాచేపల్లిలో ముగ్గురికి కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధరణ అయిన సంగతి తెల్సిందే. ఇది ఎలా వ్యాప్తి చెందిందనే కోణంలో గ్రామీణ ఎస్పీ విజయరావు సారథ్యంలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్లు, పలువురు ఎస్సైలు నాలుగైదు రోజులుగా శ్రమించి అందుకు కారణాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపారు.

Guntur rural sp vijayarao
గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు
author img

By

Published : Apr 14, 2020, 2:09 PM IST

దిల్లీతో సంబంధం లేని... విదేశీ పర్యటనలకు వెళ్లని ముగ్గురు జిల్లా వాసులకు కరోనా సోకింది. వైరస్ బాధితులతో ఎలాంటి సంబంధం లేకున్నా వీరికి కరోనా ఎలా వ్యాపించిందన్న గుట్టును గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు సారథ్యంలోని బృందం ఛేదించింది. బాధిత కుటుంబాలను పోలీసులు సంప్రదించి వారి నేపథ్యాలు తెలుసుకున్నారు. బాధితులు ఎక్కడెక్కడ పర్యటించారు? ఎవరితో కలిసి తిరిగారు? ఫోన్‌కాల్స్‌ డేటా ఏంటి? అన్న వివరాలు సేకరించి విశ్లేషించారు. చివరికి.. వారికి కరోనా ఎలా సోకిందన్నదీ తేల్చారు.

  • దాచేపల్లి బాధితుడు గత నెల 24 నుంచి 26 మధ్య క్రోసూరులో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే క్రోసూరులో దిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారు ఉండటంతో ఆ కోణంలో ఎవరి నుంచి అయినా వ్యాప్తి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. అప్పటికే సదరు బాధితునికి దీర్ఘకాలిక వ్యాధి ఉండటంతో కరోనా సోకిన కొద్దికాలానికి మృతిచెందాడు.
  • పొన్నూరులో ఒకరికి వ్యాపించింది. ఈయన అంతకు ముందు స్ధానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వైద్యసేవల కోసం వెళ్లారు. అదే ఆస్పత్రిలో పని చేసే ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. సదరు టెక్నీషియన్‌ ద్వారా ఏమైనా వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు బాధితుడి కుటుంబీకులు ఒకరు గుంటూరులో మత ప్రార్థనల్లో పాల్గొన్నారని గుర్తించారు. వీరి ద్వారా ఏమైనా వ్యాపించి ఉండొచ్చని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
  • నరసరావుపేటలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నకిరికల్లులో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఎవరి నుంచి అయినా వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈయన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కరోనా వైరస్‌ సోకి చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో అమల్లోకి సరి - బేసి విధానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.