ఇటీవల జరిగిన గుంటూరు నగరపాలక ఎన్నికల్లో వైకాపా కార్పొరేటర్‌గా విజయం సాధించిన రమేశ్ గాంధీ మృతి చెందారు. నగరంలోని 6వ డివిజన్‌ను నుంచి ఆయన కార్పొరేటర్‌గా గెలిచారు. గుంటూరు నగర వైకాపా అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన.. మేయర్ పదవి కోసం పోటీపడ్డారు. కొన్ని కారణాలతో కావటి మనోహర నాయుడికి మేయర్ పదవి దక్కింది.
ప్రమాణ స్వీకారం రోజునే రమేశ్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా.. కొవిడ్ నిర్ధరణ అయింది. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరబాద్ తరలించారు. అక్కడ 20 రోజులకు పైగా చికిత్స పొందారు. కరోనా నుంచి బయటపడినప్పటికీ.. ఇతర అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఉపిరితిత్తుల్లో సమస్య ఏర్పడి ఇవాళ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: