ETV Bharat / city

గుంటూరు ఛానల్​ పొడిగింపునకు సర్కార్ ఆదేశాలు - గుంటూరు ఛానల్​ పనులకు రివర్స్ టెండరింగ్

గుంటూరు, ప్రకాశం జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. గుంటూరు ఛానల్​ పొడిగింపు పనులకు పూనుకుంది.

ఛానల్
author img

By

Published : Oct 18, 2019, 9:33 AM IST

గుంటూరు ఛానల్​ పొడిగింపునకు సర్కార్ ఆదేశాలు

గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాలువ సర్వేకు గత ప్రభుత్వం 89.5 లక్షల రూపాయలను కేటాయించగా...2019 జనవరి 10 న కాలువ పొడిగింపునకు 274.53 కోట్లరూపాయలను మంజూరు చేసింది. ఎన్నో పోరాటాల ఫలితంగా తమ కల నెరవేరిందని ప్రజలు సంతోషించేలోపే కొత్త ప్రభుత్వం రావడటంతో పనులు నిలిపివేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కొంతమంది స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో ఎట్టకేలకు స్పందన లభించింది. రెండు రోజుల క్రితం పనులు రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు రివర్స్ టెండరింగ్​కు ఆదేశాలు జారీ చేసింది. కాలువ పొడిగిస్తే గుంటురు జిల్లా పెదనందిపాడు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరులోని అన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది. 49 గ్రామాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. పర్చూరు ప్రజలు తమ ఆశలు నెరవేరే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Intro:FILE NAME :AP_ONG_41_18_GUNTURCHANEL_REVERS_TENDARING_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : గుంటూరు చానల్‍ పొడిగింపునకు మోక్షం లభించింది... రివర్స్ టెండరింగ్ కు ఆదేశాలు జారీ చేసారు... గుంటూరు చానల్ కాలువ సర్వేకు గతప్రభుత్వం రూ.89.5 లక్షల రూపాయలు మంజూరు చేసింది... 2019 వసంవత్సరం జనవరి 10 వతేదీన కాలువ పొడిగింపునకు రూ. 274.53 కోట్లరూపాయలు మంజూరు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది... ప్రభుత్వం మారటంతో గత రెండు రోజులక్రితం (అక్టోబర్ 16 వతేదీ) పనులు రద్దుచేసిన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు ఆదేశాలు జారీచేసింది... గుంటూరు చానల్ పొడిగింపు.. గుంటూరు, ప్రకాశం జిల్లాల వాసుల దశాబ్దాల కల... దీనికోసం అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నారు... చానల్ పొడిగిస్తే గుంటురు జిల్లా పెదనందిపాడు నుండి ప్రకాశంజిల్లా పర్చూరు నియోజకవర్గం లొని అనేక గ్రామాలకు సాగు, తాగు నీటి సమస్యలు తీరతాయి... రెండు జిల్లాల్లొని 49 గ్రామాలపరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. ఆయా గ్రామాలకు తాగునీటి సమస్యకు శాశ్వతపరిషారం లభిస్తుంది. ఎన్నో పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది... కల సాకారమైనట్లేనని కర్షకులంతా భావించారు... ఇంతలో ప్రభుత్వం మారింది.. విధాన నిర్ణయాల్లొ భాగంగా ఆపనులను రద్దుచేసింది... దీంతో ఆసమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.. ప్రాజక్టు ప్రాధాన్యత స్దానిక నాయకులు, యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో... కొత్త సర్కారు పచ్చజెండా ఊపింది.. నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లారాజమోహనరావు, అన్నదాతలు హర్షం వ్యక్తంచేసారు.. పర్చూరు ప్రాంత అన్నదాతల ఆశలు ఎట్టకేలకు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899 Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.