Nakka Anandbabu on Agriculture pump sets issue: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి.. ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని.. మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా వేమూరులోని అమర్తలూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే రైతులపై భారం పడుతుందన్నారు. పంట కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మండిపడ్డారు. రైతుల తరఫున పోరాటానికి తెదేపా సిద్ధంగా ఉందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచుతామని చెప్పిన ప్రభుత్వం ఒక్క కేంద్రంలోనైనా సకాలంలో ఎరువులు అందించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. పంట కొనుగోలు, ఎరువుల పంపిణీలో పైస్థాయి నాయకుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు దోచుకుంటూ.. సామాన్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి : వీవోఏ నాగలక్ష్మిది ఆత్మహత్య కాదు.. వైకాపా నేత చేసిన హత్య: లోకేశ్