ETV Bharat / city

Fake challans: సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల బాగోతం.. రూ.36 లక్షలకుపైగా అవినీతి - గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

రాష్ట్రంలో వివిధ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలనాలు వెలుగుచూడటం కలకలం రేపింది. మూడు చోట్ల కలిపి సుమారు 36లక్షల రూపాయలకుపైగా అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. స్థానిక పోలీస్‌స్టేషన్లలో అధికారులు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Fake challans
Fake challans
author img

By

Published : Aug 13, 2021, 3:47 AM IST

విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. 69 నకిలీ చలానాలతో 21 లక్షల అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. జిల్లా రిజిస్ట్రార్‌ సహా మరికొందరు అధికారులు.. కార్యాలయంలోని వివిధ దస్త్రాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సహాయ లేఖరి గణేష్‌పై.. సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ గజపతినగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల బాగోతం

మంగళగిరిలో 8 లక్షలు..

గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ నకిలీ చలానాల బాగోతం బట్టబయలైంది. నలుగురు లేఖరుల చేతివాటంతో.. 8 దస్త్రాలకు రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో 8 లక్షలు పక్కదారి పట్టించినట్లు తేలింది. సీఎంఎఫ్​ఎస్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో ఈ అవినీతి వెలుగుచూసింది. ఆ సొమ్మును ఇప్పటికే రికవర్‌ చేశామన్న రిజిస్ట్రార్ రాధాకృష్ణమూర్తి.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో..

కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. 54 దస్త్రాలకు సంబంధించి 7లక్షల 40వేల రూపాయల గోల్‌మాల్ జరిగింది. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ సోఫియా బేగం, జూనియర్‌ అసిస్టెంట్ వీరన్నపై సస్పెన్షన్ వేటు పడింది. మరో నలుగురు లేఖరులకూ ఈ అక్రమంలో భాగముందన్న ఆరోపణల నేపథ్యంలో వారిపైనా చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి:

polycet-2021: సెప్టెంబరు 1న పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష

భాజపా నేత ఇంట్లో పేలుడు- ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.