ETV Bharat / city

గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాకు బ్రేక్​.. - బి.ఆర్ స్టేడియం

గుంటూరు నగరంలో మంచినీటిని సరఫరా ప్రధాన పైప్ లైన్ల లీకులకు మరమ్మతుల కారణంగా ఈ నెల 11న మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు నగర పాలక సంస్థ ఎస్​ఈ రవికృష్ణ రాజు తెలిపారు. నగరంలోని హరిహర్​మహల్ రిజర్వాయర్ పరిధిలోని 7 ప్రాంతాల్లో, నెహ్రూ నగర్ రిజర్వాయర్ పరిధిలోని 18 ప్రాంతాల్లో మంచినీటి సరఫరా పైప్ లైన్ల లీకులకు మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

drinking water supply closed for two days in guntur
నగర పాలక సంస్థ ఎస్​.ఈ రవికృష్ణ రాజు
author img

By

Published : Jan 10, 2021, 3:16 PM IST

గుంటూరు నగరంలో తాగునీరు సరఫరా చేయూ ప్రధాన పైప్​లైన్ల లీకులకు మరమ్మతుల నిర్వహిస్తున్నందున ఈ నెల 11వ తేదీ వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని గుంటూరు నగర పాలక సంస్థ ఎస్​ఈ రవికృష్ణ రాజు తెలిపారు. నగరంలోని హరిహర్​మహల్ రిజర్వాయర్ పరిధిలోని 7 ప్రాంతాల్లో, నెహ్రూ నగర్ రిజర్వాయర్ పరిధిలోని 18 ప్రాంతాల్లో తాగునీటి సరఫరా చేయు పైప్ లైన్ల లీకులకు మరమ్మతులు జరగనున్నట్లు తెలిపారు. అంతేకాక హరిహర్ మహల్ రిజర్వాయర్​లోని 750 కేయల్ సంపు, బీఆర్ స్టేడియంలోని రిజర్వాయర్ల క్లీనింగ్, తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్​లోని వాల్వ్ మరమ్మతులు నిర్వహిస్తున్నామన్నారు. 10 తేదీన మధ్యాహ్నం వరకు లీకు మరమ్మతు పనులు పూర్తి చేసి సాయంత్రానికి పాక్షికంగా మంచి నీటి సరఫరా జరుగుతుందని.. 11వ తేదీన ఉదయం నుంచి యథావిధిగా మంచినీటి సరఫరా చేస్తామన్నారు.

ఇదీ చదవండి: జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.