సీజనల్ వ్యాధులు, కరోనా వైరస్‌పై వాలంటీర్లతో కలిసి గుంటూరులో ఇంటింటా అవగాహన కల్పించాలని అధికారులను గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ ఆదేశించారు. 60 ఏళ్లు పైబడిన వారికి స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించాలన్నారు.
రోజువారీ పర్యటనలో భాగంగా గుంటూరులోని బొంగారలబీడు, శారద కాలనీ తదితర ప్రాంతాల్లో కమిషనర్ చల్లా అనురాధ పర్యటించారు. పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. మాస్కులు ధరించని వారికి అపరాధ రుసుము విధించాలని మహిళా పోలీసులను ఆదేశించారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే టిఫిన్ సెంటర్లను మూసివేయాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని చెత్తను పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు.
ఇదీ చదవండి