గుంటూరు జిల్లాలోని మంగళగిరి బెటాలియన్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. శాంతిభద్రతల మాదిరిగానే మొక్కలను రక్షించాలన్నారు. పోలీసు కుటుంబాలనూ మొక్కలు నాటడంలో భాగస్వామ్యం చేయాలని ఆయన పేర్కొన్నారు. అన్ని బెటాలియన్లలో మియావకి పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత వర్చువల్ ద్వారా పాల్గొన్నారు. ప్రకృతిలో సమతౌల్యం లోపించడం వల్లే విపత్తులు సంభవిస్తున్నాయని అన్నారు. విపత్తులు అరికట్టాలంటే అందరూ మొక్కలు నాటాలని హోంమంత్రి సూచించారు. మొక్కలు నాటడంలో పోలీసుల చొరవను అభినందనీయమని ప్రశంసించారు.
ఇదీ చదవండి: ఏపీకి ఇచ్చిన హామీల ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరం: మంత్రి బుగ్గన