CPI Agitations At Guntur: రాష్ట్ర రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. సీఎం జగన్ నియంత పోకడ పోతున్నారని సీపీఐ నేతలు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలని సూచించారు.
గుంటూరులోని శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జ్ సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా చేయడానికి అంగీకరించిన జగన్.. ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇప్పటికైనా కోర్టు తీర్పు మేరకు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని.. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Capital Issue: " సీఎం తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు"