ETV Bharat / city

పత్తికి చీడపీడల కష్టాలు... దిగుబడులు రాక రైతులు కుదేలు

లక్షలాది హెక్టార్లలో సాగు... అందుబాటులో అనుబంధ పరిశ్రమలు... సీసీఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల అండ... అయినా పత్తి రైతులు గట్టెక్కలేని పరిస్థితి. పెరుగుతున్న పెట్టుబడులు, చీడపీడలతో పంట నష్టాలకు తోడు ఏటికేడు వస్తున్న మార్పులు పత్తి రైతులను చిత్తు చేస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో పత్తిసాగు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. కొత్త అవకాశాల సృష్టి సంగతి అటుంచి.... ఉన్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోవటమే దీనికి కారణం. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాటన్ టూ క్లాత్ ఒరవడి అమలవుతోంది. కానీ మన వద్ద పరిస్థితి అందుకు భిన్నం. తెల్లబంగారం పండించే రైతులు, కొనుగోలు చేసే వ్యాపారులు, పరిశ్రమ వర్గాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... ఇలా ఎవరికి వారు ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

cotton cultivation farmers problems in andhrapradhesh
దిగుబడల తగ్గుదలతో పత్తిరైతుల ఇబ్బందులు
author img

By

Published : Dec 1, 2020, 9:09 PM IST

తెల్ల బంగారం... పత్తి సాగు చేసేవారికి వచ్చే లాభాలను బట్టి దానికి పెట్టిన పేరు. కానీ పత్తి సాగు రైతులకు లాభసాటి కాకపోగా... బోలెడు ప్రయాస మిగులుతోంది. మన రాష్ట్రంలో ఈ ఏడాది 6.01లక్షల హెక్టార్లలో ఈ ఏడాది పత్తి సాగైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎకరానికి 16 క్వింటాళ్ల వరకూ దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఈ ప్రకారం 11.51లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి చేతికి వస్తుందని అంచనా వేశారు. అధిక వర్షాలతో ఈ అంచనాలు తలకిందులయ్యాయి. అందులో సగం వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. వరదల కారణంగా కొన్నిచోట్ల పత్తి పంట మునిగి పాడైపోయింది. వర్షాలకు తడిసి తొలి విడత పత్తి నాణ్యత కోల్పోయింది. గులాబీ రంగు పురుగు గతంలో ఎన్నడూ లేని విధంగా విజృంభిస్తోంది.

అన్నీ కలిపి పత్తి రైతులకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టాయి. ఎకరానికి రెండు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు పాడైపోయింది. రెండో తీతలో వస్తున్న పత్తి కూడా నెమ్ముశాతం ఎక్కువై, నాణ్యత లేదని వ్యాపారులు ధరలు తగ్గించారు. క్వింటాకు బయట వ్యాపారులు 4వేల రూపాయలకు మించి ఇవ్వటం లేదు. ఇక సీసీఐ ఈ ఏడాది క్వింటా పత్తికి పొడవు పింజకు రూ.5,825, తక్కువ పింజకు రూ.5,515గా కనీస మద్దతు ధర ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 5శాతం ధర పెంచారు. పత్తి కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 32 మార్కెట్ యార్డులతోపాటు 53 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు చేసేలా మార్కెటింగ్‌శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రైతులు ఎక్కడికైనా తెచ్చి పంట విక్రయించుకోవచ్చు. కానీ ఇప్పటి వరకూ 32 కేంద్రాల్లో మాత్రమే పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయి. పంట దిగుబడులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. ఎకరాకు 30వేల వరకూ పెట్టుబడి పెట్టారు. కౌలు 15వేలు దీనికి అదనం. ఇక పత్తి తీత కూలీలు, రవాణా ఖర్చులు ఉండనే ఉన్నాయి. పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం దేవుడెరుగు.. ఇంకా అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమ్మకాలపై నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం...

కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల ప్రభావం కూడా పత్తి అమ్మకాలపై కనిపిస్తోంది. గతంలో రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకెళితే సీసీఐ కొనుగోలు చేసేది. 1 శాతం మార్కెట్‌ పన్ను చెల్లించి, ఆ పత్తిని సీసీఐ సొంత ఖర్చులతో జిన్నింగ్‌ మిల్లుకు తరలించేది. మార్కెటింగ్ చట్టంలో కేంద్రం తెచ్చిన సవరణలతో... ఇపుడు రైతులకు భారం పెరిగింది. మార్కెట్ యార్డులోనే పంట అమ్మాల్సిన పని లేదన్న వెసులుబాటుతో ఇపుడు పత్తి కొనుగోళ్లు జిన్నింగ్ మిళ్లుల్లోనే జరుగుతున్నాయి. గతంలో పంట తరలింపు ఖర్చులను భరించిన సీసీఐ ఇప్పుడు పక్కకు తప్పుకుంది. దీంతో పత్తి రవాణా భారం రైతుల నెత్తిన పడింది. మార్కెట్ యార్డులు రైతులకు అందుబాటులో ఉండేవి. కాని జిన్నింగ్ మిల్లులు దూరంగా ఉండటంతో రవాణా వ్యయం పెరుగుతోంది. యార్డుకు తరలిస్తే అయ్యే రవాణా చార్జీల కంటే.. మిల్లులకు తీసుకెళ్లేందుకు రైతులపై అదనపు భారం పడుతోంది. జిన్నింగ్‌ మిల్లుల్లో కొన్న పత్తికి రవాణా చార్జీలు భరించబోమని బయ్యర్లు తెగేసి చెబుతున్నారు. అసలే ఈ ఏడాది వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గుతున్న పరిస్థితుల్లో రవాణా చార్జీలు కూడా రైతులు భరించాల్సి వస్తే... పంట పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుంది. రవాణా చార్జీల సమస్యను పరిష్కరించాలని రైతుల విజ్ఞప్తితో 14చోట్ల జిన్నింగ్ మిల్లులకు తెచ్చేవారికి రవాణా ఛార్జీలు భరించేందుకు సిద్ధమైంది. మిగతా చోట్ల మాత్రం రైతులే పెట్టుకోవాల్సి ఉంటుంది.

సమస్యల ప్రభావం...

ఇక రైతులు పత్తి తీయటం, ఆరబెట్టడం, రవాణా విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం తీవ్ర నష్టం చేకూరుస్తోంది. పత్తి తీసే సమయంలో కూలీలు గుడ్డి కాయలు, నల్లకాయలు, అలాగే తెగుళ్ల భారిన పడ్డ వాటిని పక్కన పడేయాలి. అలా కాకుండా వాటిని మిగతా పత్తిలో కలిపేస్తే నాణ్యతపై ప్రభావం చూపిస్తోంది. అలాగే పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే ముందు ఆరబెట్టడం తప్పనిసరి. తేమ శాతం 8 నుంచి 12 శాతంలోపు ఉంటే మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. అంతకు మించితే వెనక్కు పంపిస్తారు. ఇది రైతులకు అదనపు ప్రయాసగా మారింది. అందుకే తూకం ఎక్కువ వస్తుందనే ఆలోచన పక్కనపెట్టి తేమ లేని పత్తిని తీసుకెళ్లటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు.

పత్తిని ప్లాస్టిక్ గోతాముల్లో రవాణా చేయటం పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల ప్లాస్టిక్ పోగులు పత్తిలో కలిసిపోతున్నాయి. ఇలా కల్తీ జరగటం వల్ల స్పిన్నింగ్ సమయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ప్లాస్టిక్ పోగులు కలిసి దారం తెగిపోతుండటంతో ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తోంది. వస్త్రంతో తయారు చేసిన సంచుల్లో తరలిస్తే ఇలాంటి సమస్య తలెత్తదు. గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల స్పిన్నింగ్ మిల్లుల వారే రైతులకు ఇలాంచి సంచులు అందజేశారు. దాన్ని పూర్తిస్థాయిలో రైతులకు అందజేయాల్సి ఉంది. ఒకవేళ బట్టతో తయారు చేసిన సంచులు లేకపోతే... పత్తిని నేరుగా ట్రాక్టర్ ట్రాలీలో వేసి తీసుకెళ్లవచ్చు. దీనివల్ల రైతులకు పత్తి ప్యాకింగ్ ఖర్చులు కూడా ఆదా అవుతాయి. ఇలా వాహనంలో తెచ్చిన పత్తిని కూడా సిసిఐ కొనుగోలు చేస్తోంది. వర్షాల కారణంగానూ పత్తి నాణ్యతలో తేడా వస్తోంది.

విస్తీర్ణం పెరిగినా... దిగుబడులు తగ్గాయి...

మన రాష్ట్రంలో ఈ ఏడాది 15లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. దాని ప్రకారం 25 లక్షల పత్తి బేళ్లు వచ్చే అవకాశముంది. తెలంగాణాలో ఇది 55 లక్షల బేళ్లుగా... దేశవ్యాప్తంగా చూస్తే 280లక్షల బేళ్లు వస్తాయని అంచనా వేశారు. అయితే గులాబీరంగు తెగులు పత్తి రైతులనే కాదు పరిశ్రమనూ దెబ్బతీసింది. విస్తీర్ణం పెరిగినా... దిగుబడులు గతేడాది కంటే 20శాతం తగ్గాయి. గతంతో పోలిస్తే మన రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. మంచి సారవంతమైన నేలలు, సాగునీటి వసతి ఉన్నా ఏటికేడు విస్తీర్ణం పడిపోతోంది. మిర్చి వంటి పంటలకు మంచి ధరలు లభిస్తుండటం, పత్తికి చీడ పీడలు పెరగటం, దిగుబడులు తగ్గటం ఇవన్నీ కొన్ని కారణాలు. అలాగే పత్తి అనుబంధ పరిశ్రమల అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగకపోవటం వల్ల రైతులు కొత్తగా పత్తిసాగుకు ముందుకు రావటం లేదు. మన దేశంలో చూస్తే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో పత్తి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. గతేడాది పత్తి ధర బయటి మార్కెట్లో ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి సీసీఐ గిట్టుబాటు ధర కల్పించింది. ఇది రైతులకు సానుకూల అంశమే. అయితే రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్​లో పేర్లు నమోదు చేసుకుని ఉండాలి. అలాగే ఆర్.బి.కెలకు వెళ్లి పత్తి అమ్మకానికి సంబంధించి పేర్లు రాయించుకోవాలి. వారు సూచించిన కేంద్రానికి, చెప్పిన సమయానికి తీసుకెళ్లాలి. దీనికి అవసరమైన కాగితాలు తప్పనిసరి. ఈ ప్రక్రియ అంతా ఇబ్బందులు ఉండటంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. అయితే వేర్వేరు కారణాలతో పంట దిగుబడి తక్కువగా ఉండటంతో ఈసారి వ్యాపారం ఎక్కువ కాలం సాగే అవకాశాలు కనిపించటం లేదు. జనవరి కల్లా పత్తి కోతలు, అమ్మకాలు పూర్తయ్యే అవకాశమున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో మన దేశీయ పరిశ్రమలు సైతం చైనా నుంచి పత్తి దిగుమతి చేసుకునేవి. ఈసారి చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి కాబట్టి దేశీయంగా పండే పత్తికి మంచి ధర వస్తుందని వ్యాపారులు అంటున్నారు. పంటసాగులో ఇబ్బందులు ఉన్నా... మార్కెట్ ధర పరంగా సమస్యలు లేవని చెబుతున్నారు.

విదేశాలకు ఎగుమతులు...

ఇక రాష్ట్రంలో తయారవుతున్న పత్తికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. పత్తికి సంబంధించి వరుసగా జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్ పరిశ్రమలు కీలకం. జిన్నింగ్ చేసి విత్తనాలు, పత్తిని వేరు చేస్తారు. విత్తనాలను నూనె తయారీకి పంపిస్తారు. పత్తిని స్పిన్నింగ్ మిల్లులకు తరలిస్తారు. రాష్ట్రంలో 130 వరకూ స్పిన్నింగ్ మిల్లులు దారం తయారు చేస్తున్నాయి. అయితే మనం అక్కడితోనే ఆగిపోతున్నాం. తయారైన దారంలో 90శాతం తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. వస్త్రపరిశ్రమలు ఏర్పాటైతే ఇక్కడే ఆ దారాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా వీవింగ్, ప్రాసెసింగ్, డైయింగ్ యూనిట్లు ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే దీనికి అధిక పెట్టుబడితోపాటు ఆధునిక సాంకేతికత సమకూర్చుకోవాలి. అలాగే మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యం. బయట ఉన్న డిమాండ్​ను బట్టి ఎలాంటి వస్త్రం కావాలి... దాని సైజులు, రంగులు ఇవన్నీ నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే వస్త్రాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యం.

టెక్స్ టైల్స్ పరిశ్రమల ఏర్పాటు కోసం కొందరు ముందుకు వచ్చారు. పిపిఈ విధానంతో పెట్టాలని భావించారు. ముఖ్యంగా ప్రాసెసింగ్ కు సంబంధించి నీరు అవసరమవుతుంది. అలాగే వృథా నీటిని శాస్త్రీయంగా శుద్ధి చేసే బయటకు వదలాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వరకైన ప్రభుత్వం చేయాలని కోరారు. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవటంతో పరిశ్రమల ఏర్పాటు ఊపందుకోలేదు. ఇక టెక్నాలజీ అప్ గ్రెడేషన్ ఫండ్ స్కీం క్రింద స్పిన్నింగ్ పరిశ్రమలకు రావాల్సిన నిధులు గత 8 ఏళ్లుగా పెండింగ్​లో ఉన్నాయి. బకాయిలు వస్తే కొందరైనా పరిశ్రమ విస్తరణకు ప్రయత్నించే అవకాశముంది. ప్రభుత్వాల నుంచి అవసరమైన సహకారం లేకపోవటం వల్లే పెద్దగా పరిశ్రమలు ఏర్పాటు కాలేదని... అయితే మున్ముముందు మంచి అవకాశాలున్నాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అంతర్జాతీయంగా ఆర్గానిక్ పత్తికి మంచి డిమాండ్ ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ తరహా సాగు జరగటం లేదు. కొందరు పెద్ద రైతులైనా ఆర్గానిక్ విధానంలో పత్తి సాగు చేస్తే మంచి ధర లభిస్తుంది. బిటి కాటన్ వచ్చిన తర్వాత కూడా వివిధ రకాల తెగుళ్లు వస్తుండటంతో రైతులు పురుగుమందులు స్ప్రే చేస్తున్నారు. వీటి నుంచి బయటకు రావాలి. అపుడు నాణ్యమైన పత్తితో రైతులకు లాభాలు వస్తాయి. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైతే అన్నదాతలకు మరింత మేలు జరుగుతుంది.

ఇదీచదవండి.

ఈనెల 21 నుంచి భూముల రీసర్వే.. ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.