ETV Bharat / city

కొవిడ్ మరణాల్లో అగ్రస్థానానికి గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి తీవ్రమవుతోంది. జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య 26 వేలు దాటింది. కేసుల పరంగా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్న గుంటూరు.. మరణాల సంఖ్యలో అగ్రస్థానానికి చేరుకుంది.

కొవిడ్ మరణాల్లో అగ్రస్థానానికి గుంటూరు జిల్లా
కొవిడ్ మరణాల్లో అగ్రస్థానానికి గుంటూరు జిల్లా
author img

By

Published : Aug 13, 2020, 9:08 PM IST

గుంటూరు జిల్లాలో కొవిడ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. కేసుల పరంగా నాలుగో స్థానంలో ఉన్న జిల్లా మరణాల సంఖ్యలో అగ్రస్థానానికి చేరింది. జిల్లాలో ఇవాళ కొత్తగా 595 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26 వేల 32కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 189 ఉన్నాయి. ఆ తర్వాత మాచర్లలో 67, నరసరావుపేట 33, పిడుగురాళ్ల 25, తెనాలి 21, క్రోసూరు 19, పెదకాకాని 19, అమరావతి 17, రేపల్లె 16, దాచేపల్లి 16, చిలకలూరిపేట 15, మేడికొండూరు 11, తాడేపల్లి 11, నగరం 10, చెరుకుపల్లి, తాడికొండలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 143 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

జిల్లాలో కరోనా నుంచి 16 వేల 310 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వల్ల ఇప్పటి వరకూ జిల్లాలో 265 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక కరోనా మరణాలు గుంటూరు జిల్లాలో సంభవించినట్లయింది. మరణాల పరంగా అగ్రస్థానంలో ఉండటం అధికారుల్ని కలవరపరుస్తోంది.

గుంటూరులో ఇప్పటి వరకూ 10 వేల కేసులు నమోదైన తరుణంలో అధికారులు నివారణ చర్యలు తీవ్రం చేశారు. ప్రతి వార్డు పరిధిలో ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. 60 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రాణాంతక వ్యాధులతో ఉన్న వారికి కూడా పరీక్షలు చేయాలని అధికారులు ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టులు గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. వార్డు వాలంటీర్ల సాయంతో ఈ ప్రక్రియ చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి ఆదేశాలిస్తున్నారు. ఉదాసీనంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.

ఇదీ చదవండి:

కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 82 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.