గుంటూరులోని బొంగరాల బీడు, వసంతరాయపురం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ.. శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రి, వార్డు పర్యావరణ కార్యదర్శులకు కమిషనర్ చల్లా అనురాధ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను కమిషనర్ పరిశీలించారు. సైడు కాల్వలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి ఉండటం, కాల్వల్లో చెత్త తీసేందుకు వీలులేకుండా స్లాబ్ వేసి ఉండటంపై ఆగ్రహించారు.
పారిశుద్ధ్య పనులల్లో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బంది, అధికారులుపై చర్యలు తీసుకోవడంలో వెనకాడబోమని కమిషనర్ హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో వాలంటీర్లతో కలిసి అన్ని వీధులు తిరిగారు. కాలువల్లో చెత్త వేయకుండా, తడి పొడి చెత్త విభజన గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ళలో వ్యర్ధాలు, కాలువల్లో వేసేవారిని గుర్తించి అపరాధ రుసుం విధంచాలని ఆదేశించారు.
ఏమైనా సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కాలువల నిర్మాణం చేసే సమయంలో మురుగు పారుదలకు వీలుగా నిర్మాణం జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు చూడాలని స్పష్టం చేశారు. లేకుంటే సదరు కాంట్రాక్టర్ బిల్లులను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: