Clashes: పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని జూపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీలో ఒక వర్గం మరో వర్గానికి చెందిన ఇళ్లపైకి రాళ్లు రువ్వారంటూ ఘర్షణకు దిగారు. వ్యక్తిగత దూషణలతో పాటు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి: APSRTC: ఆర్టీసీ రాబడిలో.. ఏ రోజుకు ఆ రోజే 25% సొమ్ము ప్రభుత్వానికి..